twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్ కు 'కబాలి' నిర్మాత వార్నింగ్, క్షమాపణకై డిమాండ్

    By Srikanya
    |

    చెన్నై: హీరో విశాల్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా మాట్లాడి వారి కోపానికి గురి అయ్యారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో విశాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నిర్మాతలకు విశాల్ వైపు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేలా చేసాయి. ముఖ్యంగా కబాలి నిర్మాత కలైపులి ధాను..నిర్మాతల మండలి అధ్యక్ష్యుడిగా విశాల్ కు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంసంగా మారింది.

    విశాల్ తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ...నిర్మాతల మండలి కొన్ని బర్నింగ్ ఇష్యూలకు సరిగా స్పందించటం లేదని నిందారోపణలు చేసారు. పైరసీ వంటి విషయాలలో వారు సీరియస్ గా పరిష్కారం వెతకటం లేదని విమర్శించారు.

    పైరసీ వల్ల కేవలం నిర్మాతలకు మాత్రమే నష్టం అనుకుంటే పొరపాటు, పైరసీ ప్రభావంతో సినిమా సరిగా ఆడకపోతే దాని ఎఫెక్ట్ నటీనటులపై,టెక్నీషియన్స్ పడుతుంది అన్నారు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ పైరసీ విషయమై చర్చలు జరిపి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. నిర్మాతల రెవిన్యూ పెరగటానికి డిటిహెచ్ రైట్స్ రైట్స్ గురించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సినిమా రిలీజైన రెండు వారాల తర్వాత డీవిడి రిలీజ్ అయ్యేలా ఎగ్రిమెంట్స్ చేసుకోవాలని చెప్పాడు.

    అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి చర్చించకుండా కేవలం అంతా కూర్చుని,కబుర్లు చెప్పుకుంటూ, బోండాం,బజ్జీ తింటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించాడు. అలాగే కౌన్సిల్ లో జనం మారాలని, కొత్త నీరు రావాలని, అప్పుడే బాగుపడుతుందని ఘాటుగా కామెంట్స్ చేసాడు.

    స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

     నేను పోటీ చేస్తా

    నేను పోటీ చేస్తా

    ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు చైర్మన్ గా కబాలి నిర్మాత కలైపులి ధాను ఉన్నారు. జనవరి ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను అన్నారు.

    వారంలోగా

    వారంలోగా

    చాలా మంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోని నిర్మాతలు విశాల్..వారం లోగా క్షమాపణలు చెప్పాలని లేదా తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

    సమస్య ఏంటి

    సమస్య ఏంటి

    క్షమాపణ చెప్పకపోతే విశాల్ తదుపరి చిత్రాలకు తమ నుంచే కాక డిస్ట్రిబ్యూటర్స్ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉండదని హెచ్చరిస్తున్నారు

    తెలుగు పరిశ్రమనుంచి

    తెలుగు పరిశ్రమనుంచి

    తెలుగు పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చాలా నిర్ణయాలు తీసుకుందని వాటిని అనుసరించాలని అంటున్నారు

    తగ్గించుకోవాలి

    తగ్గించుకోవాలి

    హీరోలు తమ రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలి, ముఖ్యంగా యాభై లక్షలు దాటిన వారు అంటున్నారు.

    లెటర్ వచ్చాకే

    లెటర్ వచ్చాకే

    తనకు నిర్మాతల మండలి నుంచి ఏ విధమైన లెటర్ ఇప్పటివరకూ అందలేదని, అది వచ్చాక తన పాయింటాఫ్ వ్యూ చెప్తా అన్నారు

    ఇద్దరి మధ్యే

    ఇద్దరి మధ్యే

    నిజానికి రీసెంట్ గా కబాలి నిర్మాతకు, విశాల్ కి మధ్య మాటల యుద్దం జరిగింది. దాని పరిణామమే ఇది అంటున్నారు.

    నెగ్గితే

    నెగ్గితే

    విశాల్ తాను చెప్పినట్లుగా నిర్మాతల మండిలికు పోటీ చేసి గెలిస్తే, అప్పుడు సినీ ఆర్టిస్టుల సంఘానికేకా, నిర్మాతల మండిలికు కూడా ప్రెసిడెంట్ అవుతాడు

    English summary
    Vishal has yet again landed himself in the soup for his alleged derogatory remarks against the Tamil Film Producers Council (TFPC), according to a report. It is said that the Aambala actor, in one of his recent interviews, blamed the Producers Council for not acting against some of the burning issues like piracy among others, which results in producers facing a huge loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X