»   » నమిత నన్ను ముంచేసింది: దర్శకుడు

నమిత నన్ను ముంచేసింది: దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అళగాన పొన్నుదాన్‌' చిత్రంలో నటించడానికి నమిత పూర్తిస్థాయిలో సహకారం అందించలేదని, ఆమెవల్ల తన చిత్రానికి నష్టం జరిగిందని ఆ చిత్ర దర్శకుడు తిరు ఆరోపించారు. నమిత నటించిన 'అళగాన పొన్నుదాన్‌' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా గురించి తిరు విలేకర్లతో మాట్లాడుతూ...

"18 ఏళ్ల యువకుడు తనకన్నా ఎక్కువ వయస్సున్న ఆమెపై ఆశపడతాడు. ఈ పరిణామంలో అతని జీవితం ఎలా మారుతుందనే విషయాన్ని 'అళగాన పొన్నుదాన్‌'గా తెరకెక్కించాము. ఈ విషయాన్ని నమిత వద్ద కూడా చెప్పాను. అందుకు ఆమె నటించడానికి ఒప్పుకున్నారు. అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా కాల్షీట్‌ ఇవ్వలేదు. నాకు సినిమా తీయడం తెలియదని నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అలాగే సినిమాలో నవ్వ్వుతూ నటించాలని చెబితే 'ఎలా నవ్వాలి..' అని విడ్డూరంగా ప్రశ్నించేవారు. అసలు ఓ పాటలో నటించకుండా మానేశారు. క్త్లెమాక్స్‌లో పూర్తిగా నటించలేదు. ఆమె పూర్తి సహకారం లేకుండా సినిమా విడుదల చేశాను. దీనివల్ల పెద్ద నష్టం ఏర్పడిందని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X