ఫస్ట్‌లుక్‌తో ప్రాణం తోడేసిన నిత్యా మీనన్.. సింగిల్ క్యారెక్టర్‌తో అరాచకమే..
దక్షిణాదిలో అత్యంత ప్రతిభావంతులైన తారల్లో నిత్యామీనన్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అ! చిత్రంలో బోల్డ్‌గా స్వలింగ సంపర్కురాలిగా కనిపించిన నిత్యా మీనన్ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది. ఈ చిత్రం తర్వాత నిత్యా మీనన్ నటిస్తున్న చిత్రం ప్రాణ. ఒకే ఒక పాత్రతో రూపొందున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమింటంటే..

బహుభాషా చిత్రంలో నిత్య
నాలుగు భాషల్లో తీస్తున్న ప్రాణ అనే సినిమాలో నటిస్తున్నాను. అందులో ఒకే యాక్టర్ ఉంటారు. ఆ పాత్రను నేను పోషిస్తున్నాను. ఇంకా వేరే యాక్టర్లు ప్రాణ చిత్రంలో ఉండరు. చాలా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్. కాన్సెప్ట్ సినిమా అది అని ఇటీవల ఓ ఇంటర్వూలో నిత్యామీనన్ వెల్లడించారు

ప్రాణలో ఒకే ఒక క్యారెక్టర్
ప్రాణ సినిమాకు సంబంధించి ఓ విశేషం ఉంది. సౌండ్ డిజైనింగ్ ఆ సినిమా ప్రత్యేకత. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను చాలా డిఫరెంట్‌గా చేయడానికి రసూల్ కృషి చేస్తున్నారు. సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. షూటింగ్ సమయంలోనే ఉండే సౌండ్‌ను రికార్డ్ అవుతుంది. డబ్బింగ్ లేకుండా సినిమా ఉంటుంది. సహజసిద్ధంగా నేపథ్యం సంగీతం, డైలాగ్స్ రికార్డు అవుతుంది అని ఆమె చెప్పారు

తొలిసారి సింక్ సౌండ్ టెక్నాలజీతో
ప్రాణ అనే సినిమాను కేరళలోని కుమిలి అనే హిల్ స్టేషన్‌లో షూటింగ్ చేశాం. లోకేషన్‌కు ప్రాధాన్యం అంతగా లేదు. ఓ అమ్మాయి కథనే సినిమాగా తెరకెక్కించాం. నాలుగు భాషల్లో రూపొందుతున్నందున ఒకే డైలాగ్‌ను నాలుగు సార్లు చెప్పాల్సి వచ్చింది. కొంత కష్టమైనా తప్పలేదు అని నిత్య అన్నారు.

ఫస్ట్‌లుక్ షేర్ చేసిన పీసీ శ్రీరాం
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నిత్యామినన్ ఇంటెన్స్ లుక్స్ ఆ సినిమా స్టామినాను చెప్పకనే చెబుతున్నది. ఈ ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తున్నది.
ప్రాణ షూటింగ్ పూర్తి
ప్రాణ చిత్రం పలు భాషల్లో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి వీకే ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి సరౌండ్ సింక్ సౌండ్స్ టెక్నాలజీ వాడుతున్నాం. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఒకే ఒక క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్నది అని పీసీ శ్రీరాం ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











