twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.40 కోట్లు నష్టపోయా: కమల్‌ హాసన్‌ కోర్టులో వెల్లడి

    By Srikanya
    |

    చెన్నై: కమల్ హాసన్ కి నలభై కోట్లు వరకూ నష్టం వచ్చిందని, హైకోర్టులో కమల్ సోదరుడు చంద్రహాసన్ తెలియచేసారు. కమల్‌ హాసన్‌ నటించి, విడుదలకు సిద్ధంగా ఉన్న 'విశ్వరూపం' విడుదలపై 'స్టే' విధించవద్దని కమల్‌హాసన్‌ సోదరుడు చంద్రహాసన్‌ కోరారు. రీజెంట్‌ సాయ్‌ మీరా ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ తరపున రాజేంద్ర జైన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన సివిల్‌ సూట్‌కు చంద్రహాసన్‌ సమాధానం ఇచ్చారు.

    'మర్మయోగి' అనే చిత్రానికి సంబంధించి తమకు చెందాల్సిన మొత్తాన్ని జమ చేసిన తర్వాతే 'విశ్వరూపం' విడుదల ఆదేశాలు జారీ చేయాలని రాజేంద్ర జైన్‌ కోరారు. అయితే 'మర్మయోగి' నిర్మాణం ప్రారంభించడమేకాక ఒప్పందం ప్రకారం చాలావరకు చిత్రీకరణ కూడా పూర్తి చేశామని చంద్రహాసన్‌ పేర్కొన్నారు. అయితే రాజేంద్ర జైన్‌ ఆర్థికంగా వనరులు సమకూర్చలేదని, అందుకే మధ్యంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా కమల్‌హాసన్‌కు దాదాపు రూ.40 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. 'విశ్వరూపం' విడుదలయ్యేటప్పుడు 'మర్మయోగి' పెట్టుబడులు వాపసు చేస్తామన్న హామీ ఇవ్వలేదన్నారు.

    'మా 'మర్మయోగి'కి ఎదురైన సమస్య, అందుకు దారి తీసిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఒక సంవత్సరం పాటు వేరే ఏ చిత్రమూ చేయకుండా ఆ చిత్రం కోసం ప్రత్యేకంగా పని చేశాను. విస్తృతంగా ఏర్పాట్లు చేశాను. సెట్లు నిర్మించాను. చివరకు కొంత షూటింగ్‌, దర్శకత్వం కూడా చేశాను. నటించాను కూడా' అని ఆయన వివరించారు. షూటింగ్‌ను కొనసాగించేందుకు కావలసిన నిధులను పిరమిడ్‌ సాయిమీరా సమీకరించలేని కారణంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. 'నా కెరీర్‌లో ఒక సంవత్సరాన్ని, దాదాపు రూ. 40 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినందున రూ. 40 కోట్లు చెల్లించవలసిందని కోరుతూ నేను 2009 ఏప్రిల్‌ 12న వారికి ఒక నోటీస్‌ పంపాను. ఆ నోటీసుకు వారి దగ్గర నుంచి ఇంత వరకు సమాధానమే రాలేదు' అని కమల్‌ తెలియజేశారు.

    తాను పిరమిడ్‌ సాయిమీరాపై మద్రాసు హైకోర్టులో ఒక దావా వేశానని ఆయన తెలిపారు. 'తమపై కోర్టులో నా దావాను తిప్పికొట్టాడనికి కావచ్చు వారు పత్రికలలో దుష్ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వారు అసంబద్ధ, తప్పుడు ఆరోపణలతో నాకు ఒక నోటీస్‌ పంపారు' అని ఆయన తెలియజేశారు. 'వాస్తవానికి నేను వారిపై ఒక కేవియట్‌ సంపాదించాను. నేను గాని, రాజకమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ గాని ఏ కోర్టు నుంచి ఎటువంటి స్టే ఉత్తర్వునూ అందుకోలేదు' అని గతంలో కమల్‌ హాసన్‌ తన ప్రకటనలో తెలియజేశారు.

    English summary
    The producers of Kamal Hassan- starrer "Viswaroopam" submitted before the Madras High Court that there are no dues payable by it and four others to another production house Regent Saimira Entertainment Ltd. S Chandrahasan, a partner in Raajkamal Films International, in his counter to a civil suit by Regent Saimira Entertainment Ltd seeking to restrain Raajkamal from releasing the film, pending payment of outstanding dues to the firm, said there were no dues payable.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X