»   » బుద్ది వచ్చింది..పాలిటిక్స్ వద్దంటున్నాడు

బుద్ది వచ్చింది..పాలిటిక్స్ వద్దంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినిమా నటులకు రాజకీయాలు అచ్చి వస్తాయో లేదో కానీ... అక్కడ ఫెయిలైతే మాత్రం తర్వాత సినీ పరిశ్రమలో మనుగడ మాత్రం కష్టం. రాజకీయాల్లో ఉండగా ఆవేశంగా చెప్పిన డైలాగులు ఈ పరిశ్రమలో రివర్స్ అయ్యి నిర్మాతలను,దర్శకులను,ప్రేక్షకులను దూరం పెడుతూంటాయి. అదే పరిస్ధితి తనదైన హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే నటుడు వడివేలు కి ఎదురైంది . 'వైగై పుయల్‌' అంటూ అభిమానులతో ముద్దుగా పిలిపించుకునే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేసి.. రాజకీయ సమస్యల్లో చిక్కుకున్నారు. అప్పటి నుంచి తెరకు దూరమయ్యారు.

అయితే ఇక రాజకీయాలకు రానంటూ తను సినిమాలే చేసుకుంటానంటూ... మళ్లీ 'భుజబల జగజ్జాల తెనాలిరామన్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. చాలా ఏళ్ల తర్వాత వడివేలు మీడియా ముందుకు వచ్చారు. నన్ను మళ్లీ రాజకీయాల్లోకి లాక్కండి. హాస్యంపై నాకు నమ్మకం ఉంది. దాని పుణ్యమాని పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ నవ్వించడమే నా కర్తవ్యం అన్నారు.

వడివేలు మాట్లాడుతూ... ''ఇన్నేళ్లపాటు నేను సినిమాల్లో నటించకపోవడం విధిరాత అనుకుంటున్నా. అలా మూడేళ్లపాటు నేను విశ్రాంతి తీసుకున్నా. ఈ విరామంలో నన్ను వెతుక్కుంటూ చాలామంది దర్శకులు వచ్చారు. వాటిలో ముఖ్యమైన సినిమాలను మాత్రమే ఎంచుకున్నా. మళ్లీ వస్తే 'కింగ్‌'లా రావాలనుకున్నా. అయితే కొందరు నాతో సినిమా తీసేందుకు వెనకడుగు వేశారు; భయపడ్డారు కూడా.

No more politics for Vadivelu

అలాంటి పరిస్థితుల్లో మలయాళ దర్శకులు చాలా మంది నన్ను సంప్రదిచారు. మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా నటించి ఉంటే 'వడివేలు వూరి వదిలి వెళ్లిపోయారు' అని చెప్పేవారు. అందువల్లే ఒప్పుకోలేదు. 'ఇంసై అరసన్‌ 23మ్‌ పులికేసి' తర్వాత నేను ఎదురుచూసిన కథే 'తెనాలిరామన్‌'. దర్శకుడు యువరాజ్‌ కథ చెప్పగానే నటించేందుకు అంగీకరించా. కల్పాతి అగోరం ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే కొందరు వాళ్లను బెదిరించారు. దీన్ని వారు సవాలుగా తీసుకున్నారు.

అయితే నిర్మాత కల్పాతి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇదివరకు లేని స్థాయిలో ఈ సినిమా కోసం ఎక్కువగా శ్రమించాను. నా గత చిత్రాలతో పోలిస్తే నవ్వుల జల్లులు ఎక్కువే. 'ఎవరూ చేయని తప్పేమైనా చేశావా. ఇదంతా సహజమే..' అని నిర్మాత నన్ను ఓదార్చారు. నా మాదిరిగానే నా సహనటులు, సాంకేతిక కళాకారులు తీవ్రంగా శ్రమించారు. 'అసలు సినిమా సెట్‌నే తీసేశారు..', 'ఇక ఆ సినిమా లేదు' వంటి వార్తలన్నీ వచ్చాయి. కానీ వాటన్నింటినీ దాటి ఈ సినిమాను పూర్తి చేశాం అన్నారు.

ఇక '..23వ హింసించే రాజు పులికేసి'లో మాదిరిగానే ఇందులోనూ నాది ద్విపాత్రాభినయం. మహారాజు, తెనాలిరామన్‌గా రెండు పాత్రలు పోషిస్తున్నా. తమిళనాడులోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డలా నన్ను చూసుకుంటున్నారు. వారి రేషన్‌ కార్డులో పేరు లేదే తప్ప.. నేను అందరి ఇంటి బిడ్డని. ఇటీవల వచ్చిన సినిమాలను నేను పెద్దగా చూడలేదు. గౌండమణి, సంతానం హీరోలుగా నటిస్తున్నారని విన్నా. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.

'23మ్‌ పులికేసి' వంటి చరిత్రాత్మక కథలో నటించి.. రెండు భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను వడివేలు కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా తెరకు దూరమైన ఆయన ప్రస్తుతం సరికొత్తగా మళ్లీ తెరపైకి వస్తున్నారు. 'జగజ్జాల భుజబల తెనాలిరామన్‌' చిత్రంలో ఆయన శ్రీకృష్ణ దేవరాయులు, తెనాలిరాముడి పాత్రలను పోషిస్తున్నారు. పూర్తి కామెడీ తో రూపొందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.25 కోట్లతో తెరకెక్కిస్తోంది.

రోజుకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకూ వసూలు చేసిన స్టార్ కమిడియన్ వడివేలు.ఆయన గత పది రోజులుగా చేతిలో ఒక్క సినిమా కూడా లేక పూర్తి ఖాళిగా ఉన్నాడు. దానికి కారణం రజనీకాంత్ తో వడివేలు తగువు పెట్టుకోవటమే.రజనీ నటించాల్సిన 'రాణా' చిత్రం నుంచి వడివేలును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ అన్నాడీఎంకే గుర్తుపై ఓటేసినట్లు మీడియాలో పొక్కడంతో అసహనానికి గురైన వడివేలు.. 'రజనీ గిజనీ జాన్తానై.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినరోజు వీరందరి సంగతి తేలుస్తా' అని ప్రకటించారు. ఇది కూడా పరిశ్రమలోని రజనీ మద్దతుదారుల కోపానికి కారణమైంది. ఈ నేపథ్యంలో వడివేలుకు ఒక్క సినిమా కూడా లేకపోయింది. గతంలోనూ మరో స్టార్ హీరో విజయ్ కాంత్ తో తగువు పెట్టుకున్నాడు. ఆ గొడవ వడివేలు నివాస స్దలం వద్ద మొదలైంది.

English summary
Finally, Vadivelu has managed to stage a comeback with this film which is slated for release on April 18th, 2014. Speaking at the audio launch of Thenaliraman , Vadivelu said that from now on he would only concentrate in acting. He also stated that politics is out of question for him and also appealed to the media persons not to ask him questions relating to politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu