»   » సినీ పరిశ్రమపై ఇళయరాజా సంచలన కామెంట్స్

సినీ పరిశ్రమపై ఇళయరాజా సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సీనియర్ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. నేటి చిత్రపరిశ్రమ ఎటు పయనిస్తోందో ఎవరికీ తెలియడం లేదన్నారు. ప్రేక్షకులతో పాట, దర్శకులను, నిర్మాతలను కూడా తన కామెంట్స్ ద్వారా తప్పుపట్టే ప్రయత్నం చేసారు.

ఇప్పటి సినిమాల్లో సాధారణ యధార్థ కథను భావావేశంతో చెప్పే విధానం కనిపించడం లేదన్నారు. నేటి సరైన మార్గంలో వెలుతుందా? దారితపపిందా? అనే విషయం ప్రేక్షకులకు, నిర్మాతలకు కూడా తెలియడం లేదన్నారు.

అలాంటివి చూస్తున్నారు కాబట్టే

అలాంటివి చూస్తున్నారు కాబట్టే

వినోదం ముసుగులో కేవలం కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, అలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి నిర్మాతలు కూడా అలాంటి సినిమాలనే తీస్తున్నారనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు.

మంచి సినిమాలు తీయాలి

మంచి సినిమాలు తీయాలి

సినిమా అనేది ఒక వినోదాత్మక అంశమైనప్పటికీ మంచి విషయాలతో చక్కటి కథాంశాన్ని పూర్తి వైవిధ్యంగా, ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు.

ఎంగ అమ్మ రాణి

ఎంగ అమ్మ రాణి

దన్షిక నటిస్తున్న చిత్రం ‘ఎంగ అమ్మ రాణి' చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేసారు. ఎస్. బాణి దర్శకత్వంలోని ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అందుకే సంగీతం అందించాను

ఈ చిత్రం వైవిధ్యంగా ఉండటం వల్లే సంగీతం సమకూర్చానని, ఈ చిత్రంలోని తల్లి తన బిడ్డ కోసం ఎవరూ చేయని త్యాగం చేస్తుందని, అదే ఈ చిత్రం వైవిధ్యమని పేర్కొన్నారు. సాధారణంగా తాను సంగీతం సమకూర్చిన చిత్రం గురించి మాట్లాడనని, ప్రేక్షకులే సినిమాను చూసి నిర్ణయించాలని తెలిపారు.

ఆ పాట అందరికీ నచ్చుతుంది

ఈ సినిమాలో ‘వా వా మగళే..' ఈ అనే పాట తల్లి గురించి కట్టిన బాణీ అందరికీ నచ్చుతుందని, ప్రొమోకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

English summary
According to a story in Maalai Malar, Ilayaraja spoke in connection with upcoming film Enga Amma Rani, for which he is the music composer. The film, directed by S Bani and starring Dhansika, is billed as a family drama. In his speech, Ilaiyaraaja said that neither the filmmakers, nor the audience are able to judge where the film world is heading.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu