»   » రజనీతో పోల్చద్దు ప్లీజ్, ఓవర్ బిల్డప్పా?

రజనీతో పోల్చద్దు ప్లీజ్, ఓవర్ బిల్డప్పా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: లారెన్స్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తమిళనాట రజనీ అబిమాన సంఘాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన ఓ ఫొటో పెట్టి, తనను రజనీతో పోల్చద్దు అంటూ కొంచెం ఓవర్ బిల్డప్ ఇచ్చాడు. ఇదిగో ఆ ట్వీట్ ఇక్కడ..

'ఫ్రెండ్స్.. దయచేసి నన్ను రజినీ సార్ తో పోల్చకండి. ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని' ట్వీట్ చేశాడు లారెన్స్. అయితే అసలు పనిగట్టుకుని ఓ ఫొటో క్రియేట్ చేసి మరీ రజనీతో ఎవరు పోల్చారు అనేది ప్రక్కన పెడితే, అసలు ఎన్నో ఫొటోలు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో తిరుగుతూంటాయి.

Raghava Lawrence

ఫ్యాన్స్ క్రియేట్ చేసినవి, యాంటి ఫ్యాన్స్ క్రియేట్ చేసేవి, ఊసిపోక చేతిలో ఫొటోషాప్ ఉంది కదా అని కాస్సేపు ప్రాక్టీస్ చేద్దాం అనే బ్యాచ్. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఎవరూ ఇలాంటి ఫొటోలు కనపడినా సీరియస్ గా తీసుకోరు.

అయితే పని గట్టుకుని లారెన్స్.. ఆ ఫొటో వెతికి పట్టుకుని మరీ ట్వీట్ చేయటం ఏంటి అంటున్నారు. అంటే మనస్సులో లారెన్స్ కు అలా తనను రజనీతో పోల్చుకోవాలని ఉందన్నమాట అని లాజిక్ తీస్తున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ చిత్రాన్ని తమిళ్ లో మొట్టట్టశివ కెట్టశివ అనే టైటిల్ పై రీమేక్ చేస్తున్నాడు లారెన్స్. విశేషమేంటి ఈ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నప్పటికి లారెన్స్ గుండుతోనే కనిపించబోతున్నడట. కలిసొచ్చిన గుండు తనకు మరో సక్సెస్ ఇస్తోందని ఈ డాన్స్ మాస్టర్ నమ్ముతున్నాడట.

English summary
Raghava Lawrence tweeted:"Hi Friends! I saw this photo of Rajini sir & me. Pls dont compare me wid #Rajini sir, I'm very small in front of him".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu