Just In
- 7 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 57 min ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 1 hr ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 12 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
Don't Miss!
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Sports
India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!
- News
బైడెన్ సెంటిమెంట్... ప్రమాణ స్వీకారోత్సవం ఆ బైబిల్‌తో... 127 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర గ్రంథం..
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళితో కాదు...నెక్ట్స్ మురుగదాస్ తో ఖరారు ..!
చెన్నై : రజనీకాంత్ తదుపరి చిత్రం ఏం చెయ్యబోతున్నారు అనేది ఎప్పుడు ఆసక్తి కరమైన విషయమే. దానికి తోడు 'లింగ' చిత్రం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించబోయే చిత్రానికి సంబంధించి ఇప్పటికే రోజుకొకటి చొప్పున పలు వార్తలు వచ్చాయి. తదుపరి ఆయన 'రోబో' రెండో భాగంలో శంకర్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా మళ్లీ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించనున్నారని, లేదంటే రాజమౌళి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కానీ ఇప్పుడు రజనీ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఇటీవల మురుగదాస్ ద్విపాత్రాభినయ చిత్ర కథను రజనీకాంత్‌కు వినిపించినట్లు సమాచారం. ఆ కథ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారట రజనీ. త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉందని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించనున్నారు.
ఇదిలా ఉండగా 'లింగ' కేసుల పరంపర కొనసాగుతోంది.

రీసెంట్ గా 'లింగ' నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, నటుడు రజనీకాంత్‌పై క్రిమినల్‌కేసు నమోదు చేసేలా పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఈ సినిమా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.21 కోట్లు గండి పడిందని అందులో ఆరోపించారు.
మానినా పిక్చర్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఆర్.సింగారవడివేలన్ ఈ వ్యాజ్యం వేశారు. తమిళం, తమిళాషాభివృద్ధి సంబంధిత శీర్షికలకు మాత్రమే వినోదపు పన్ను మినహాయింపు ఉందని గుర్తుచేశారు. 'లింగ' సంస్కృత పదమని పేర్కొన్నారు. రజనీకాంత్ పలుకుబడితోనే పన్ను మినహాయింపు ఇచ్చారని ఆరోపించారు.
దీనిపై ఈనెల మూడో తేదీన కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు దాఖలు చేసేందుకు కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది.
ఇక ... ఓ భారీ చిత్రం ఫెయిల్యూర్ అనేక తలనొప్పులను తీసుకు వస్తుంది. రీసెంట్ గా ...సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది నష్టపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వమని వారు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ మేరకు నిర్మాతతో చర్చలు సైతం జరిగాయి..జరగుతున్నాయి.
కానీ ఈ చర్చల్లో చివరగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తాను 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో వారు మళ్ళీ ఎదురు దాడికి దిగారు. అందుకే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి సరికొత్తగా వారి నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్ళందరూ రజినీకాంత్ ఇంటివద్ద, లింగా థియేటర్స్ ముందు బిక్షం ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నారు.
వారంతా సమావేశమయ్యి... ఇక నుంచి రజినీకాంత్ ఇంటి ముందు బిక్షాటన చేయాలని, అలాగే ఏ ఏ థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసారో అక్కడ రోజు అడుక్కోవాలని వారు నిర్ణయించుకున్నారు.
అంతే కాకుండా ప్రతి సినిమా థియేటర్లో ఒక బిక్షం ఎత్తుకునే ఒక బౌల్ పెట్టి అందులో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వీలైనంత దానం చెయ్యాలని కోరటం. వాళ్ళు ఇచ్చే డబ్బు మా రికవరీకి కొంతైనా హెల్ప్ అవుతుందని వారు అంటున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.