twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కడల్‌' వివాదం : మణిరత్నంపై కమిషనర్‌కు ఫిర్యాదు

    By Srikanya
    |

    చెన్నై : అనుకున్నట్లే అయ్యింది. మణిరత్నం తాజాగా తెరకెక్కించిన 'కడల్‌' చిత్రం వివాదంలో ఇరుక్కుంటోంది. ఈ చిత్రంలోక్రైస్తవులను కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని కోరుతూ ఇండియా క్రైస్తవ జననాయగ కట్చి సోమవారం నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌కి ఓ ఫిర్యాదుపత్రం అందించింది. అందులో ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొంటూ.. తమ మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలను తొలగించటంతోపాటు దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    'రావణ్' సినిమా ప్లాపు తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా సమయం తీసుకున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎట్టకేలకు 'కడలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు కార్తీక్ తనయుడు గౌతం, రాధ కూతురు తులసిలను హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు తీసిన మణిరత్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడం సహజమే. కడలి చిత్రంపై కూడా అదే తరహా ఆసక్తి నెలకొంది. అయితే అందరి అంచనాలను నీరుగారుస్తూ ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

    కడలి చిత్రాన్ని మణిరత్నం యాక్షన్, పంచ్ డైలాగులు లాంటి కమర్షియల్ అంశాలతో కూడిన అందమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అర్జున్, అరవింద స్వామి, గౌతం పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రాజీవ్ మీనన్ కెమెరా, జయమోహన్ స్క్రిప్టు, మణిరత్నం దర్శకత్వం వెరసి ఈ సినిమాకు అందరూ టాప్ టెక్నీయన్స్ పని చేసారు. అయినా ఫలితం లేదు. దీనికి తోడు ఈ వివాదం ఇప్పుడు పంపిణీదారులను భయపెడుతోంది.

    కడలి సినిమా మొత్తం మత్స్యకార గ్రామం నేపథ్యంలో ఒక క్రైస్తవ జాలరి జీవితం చుట్టూ, క్రైస్తవ జాలరి కుర్రాడు థామస్.... బిట్రిస్ అనే అమ్మాయిని కలుసుకోవడం వల్ల అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది సినిమాలో చూపించారు. మంచికి చెడుకు మధ్య పోరాటం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే విషయాలలో ప్రేమకథను మిలితం చేసి చూపించాడు దర్శకుడు మణిరత్నం. మంచి, చెడు అనే విషయాలను బేస్ చేసుకుని బైబిల్‌లోని ధీమ్స్ న‌ు తన సినిమాలోని పాత్రల్లోకి జొప్పించి ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేసాడు.

    English summary
    After the 'Vishwaroopam' row, now Christian groups have filed a complaint against Mani Ratnam's 'Kadal', claiming that it is anti-Christian. The Indian Christian Democratic Party on Monday filed a complaint with police commissioner S George against the film. They alleged the film had objectionable scenes referring to Christianity and sought their deletion. They warned of intensified protests if police did not initiate action.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X