ఇటు ప్రజారాజ్యం...అటు 'రజనీ'రాజ్యం

ఇక వారి గొడవ ఎక్కువ కావటంతో రొబో ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక వారితో మాట్లాడతానన్నారు. అయితే అదీ జరగలేదు. ఆయన కూల్ గా గోవా నెక్ట్స్ షెడ్యూల్ కి వెల్ళిపోయారు. దాంతో మండిన వారు తమది రజనీరాజ్యం అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. అంతేగాక చెన్నై రజనీ ఫాన్స్ అశోసియేషన్ వారు ఓ పార్టీ జెండాను,పేరుని తయారుచేసి ఆయన ఫర్మిషన్ కోసం పంపారు.
ఆ పార్టీ పేరు దేశీయ ద్రవిడ మక్కల్ మున్నాట కజెం (DDMMK) . అలాగే వారు జెండాకి ఎరుపు,తెలుపు,నలుపు రంగలు వచ్చేలా రజనీ ఫేస్ ని మధ్యలో మెరిసే నక్షిత్రంగా పెట్టారు. అలాగే వారు తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైంది ...ఇక సినిమాల్లో నటించటం మాని పూర్తి స్ధాయి రాజకీయాల్లోకి రావాలని.ఇక వీటిని వివరిస్తూ చెన్నైలో క్రితం వారం వాల్ పోస్టర్స్ అతికించటం జరిగింది. ఆ పోస్టర్స్ పై రజనీరాజ్యం అని వేయటం అందరకీ ప్రజారాజ్యంని గుర్తుచేసింది.మొత్తానికి చిరు పార్టీ అక్కడ చిచ్చు లేపింది.


Click it and Unblock the Notifications











