»   » వర్ద బీభత్సం: సినీ స్టార్ల కష్టాలు, షూటింగుకు వెలుతుంటే కారుపై చెట్టు

వర్ద బీభత్సం: సినీ స్టార్ల కష్టాలు, షూటింగుకు వెలుతుంటే కారుపై చెట్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'వర్ద' తుఫాన్ చెన్నై నగరంతో పాటు తమిళనాడు తీర ప్రాంతంలో అల్ల కల్లోలం సష్టిస్తోంది. ఈ తుఫాన్ బీభత్సం కారణంగా చెన్నైలో జనజీవనం స్తంభించి పోయింది. ఇంట్లో నుండి ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. 'వర్ద' కారణంగా చాలా సినీ స్టార్లకు కష్టాలు తప్పడం లేదు. పలు షూటింగులు ఆగిపోయాయి.

ప్రముఖ నటుడు సత్యరాజ్‌ తనయుడు, తమిళ హీరో శిబిరాజ్‌ సినిమా షూటింగ్‌ కోసం వెళ్తుంటే ఆయన కారుపై చెట్టు విరిగి పడింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ అందరూ రక్షితంగా ఉండాలని సూచించారు.

శిబిసత్యరాజ్ ట్వీట్

చెన్నైలో వర్ద తుఫాన్ బీభత్సం గురించి వెల్లడిస్తూ ప్రముఖ నటుడు సత్యరాజ్‌ తనయుడు, తమిళ హీరో శిబిరాజ్‌ ట్వీట్ చేసారు.

సందీప్ కిషన్

వర్ద కారణంగా చెన్నైలోని తన ఇంటికి కాలి నడకన వెళ్లే మార్గం మూసుకుపోయిందని హీరో సందీప్‌ కిషన్‌ ట్వీట్‌ చేశారు. ఇంటి ముందు చెట్లు విరిగిపడిన ఫోటోలను సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

మంజిమా మోహన్

సాహసం స్వాసగా సాగిపో హీరోయిన్ మంజిమా మోహన్ చెన్నైలో...... వర్ద తుఫాన్ బీభత్సాన్ని వివరిస్తూ ఓ వీడియోను పోస్టు చేసింది. చెన్నైలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

సెల్ఫీలేంటి? బాధ్యతగా వ్యవహరించండి

‘నేను ఇంటికి వెళ్లే మార్గంలో కొందరు కిందపడిపోయిన చెట్లతో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దయచేసి అలాచేయొద్దు, బాధ్యతగా ప్రవర్తించండి. సురక్షితంగా ఉండండి' అని దర్శకురాలు అర్చనా కల్పథి ట్వీట్‌ చేశారు.

పరిస్థితి ఏ రేంజిలో ఉందో చూడండి

చెన్నైలో వర్ద తుఫాన్ బీభత్సం ఏ రేంజిలో ఉందో.... ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది.

English summary
"On my way to shoot a tree fell on our car and had to get out and take shelter in a nearby hotel!Stay safe guys! #Vardahcyclone" Sibi Sathyaraj tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu