»   » ఓనమ్ స్పెషల్: నయనతార లుక్ అదిరింది(ఫోటోలు)

ఓనమ్ స్పెషల్: నయనతార లుక్ అదిరింది(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మళయాల బ్యూటీ నయతార నటించిన సినిమా చాలా కాలం తర్వాత తమిళంలో విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో ఆమె నటించిన 'బాస్ ఎంగిరా భాస్కరన్' చిత్రం 2010లో విడుదలైంది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం, ఇతర కారణాల వల్ల తమిళంలో సినిమాలేవీ చేయలేదు నయన. దీంతో అప్పటి నుంచి ఆమె సినిమాలేవీ తమిళంలో విడుదల కాలేదు.

చాలా కాలం తర్వాత నయనతార తమిళంలో ఆర్యతో కలిసి 'రాజా రాణి' చిత్రంలో నటించింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. నయనతార సినిమా విడుదలకు సిద్దం అవడంతో తమిళనాడులోని ఆమె అభిమానులు హ్యాపీగా ఉన్నారు. మళయాలీల 'ఓనం'ఫెస్టివల్‌ను పురస్కరిచుకుని 'రాజారాణి' చిత్ర నిర్మాతలు నయనతార సంప్రదాయ కేరళ వస్త్రధారణలో ఉన్న ఫోటోలు విడుదల చేసారు.

ఈ సాంప్రదాయ దుస్తువుల్లో నయనతార లుక్ అదిరిపోయింది, ఎంతో అందంగా కనిపిస్తోందని పొగిడేస్తున్నారు అభిమానులు. రాజా రాణి చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ U సర్టిఫికెట్ పొందింది.

రాజా రాణి

రాజా రాణి


ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారట. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...‘రాజా రాణి చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పెళ్లి తర్వాతి తీయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం' అని వెల్లడించారు.

సినిమాలో ఓనం

సినిమాలో ఓనం


అనుకోకుండా జరిగిన విషయం ఏమిటంటే....ఓనం ఫెస్టివల్ సమీపంలోనే ఈ చిత్రం విడుదలవుతోంది. సినిమాలో కూడా నయనతారపై ఓనం ఫెస్టివల్‌కు సంబంధించిన సాంగును చిత్రీకరించారు. ఇందులో నయనతార సాంప్రదాయ దుస్తువుల్లో ఎంతో అందంగా కనిపిస్తుంది.

సంయుక్తంగా నిర్మాణం

సంయుక్తంగా నిర్మాణం


మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ U సర్టిఫికెట్ పొందింది.

మ్యూజిక్ సూపర్

మ్యూజిక్ సూపర్


‘రాజా రాణి' చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఉంటుందని అంటున్నారు నిర్మాతలు.

ఆర్య, నయనతార

ఆర్య, నయనతార


ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని దర్శకుడు వెల్లడించారు. సినిమాకు టీమంతా కలిసి ఎంతో కష్టపడి పని చేసారని, వారి సహకారం వల్లనే సినిమా అద్భుతంగా వచ్చిందంటున్నాడు డైరెక్టర్.

తెలుగులోనూ విడుదల

తెలుగులోనూ విడుదల


ఈ చిత్రంలో ఆర్య, నయనతార, జై, సంతానం, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం విడుదల కానుంది. ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందట.

English summary
Mallu girl Nayantara is getting ready for her first Tamil film release in years. The actress, whose last Kollywood flick was Boss Engira Bhaskaran and was seen in full-fledged role way back in 2010, is returning to Tamil films with forthcoming movie Raja Rani, which is hitting the screens worldwide on September 27.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu