»   »  మర్మయోగా...హీరోయిన్స్ బోగీనా?

మర్మయోగా...హీరోయిన్స్ బోగీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Hassan
అంటూ తమిళ నాట ఇప్పుడు కమల్ హాసన్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే రైలు బోగీలో జనంలా ...మర్మయోగిలో కనిపించబోయే హీరోయిన్స్ లిస్ట్ రోజురోజుకీ పెర్గిపోతోంది. ఇప్పుడు కొత్తగా శోభన ఆ లిస్ట్ లోకి చేరింది.గతంలో శోభన...కమల్ కి జోడీగా 'Enakkul Oruvan'అనే తమిళ చిత్రంలో చేసింది. అది గుర్తుంచుకునో మరెందుకో కమల్ ఆమెకి క్యారెక్టర్ ఉందని కబురుపంపాడు.

ఇక మొన్న ఫొటో సెషన్ జరుపుకున్న త్రిష,శ్రియ ఓ ప్రక్క హాట్ హాట్ గా ఈ సినిమాలో కనపడటానికి ప్రిపేర్ అవుతూంటే...హేమమాలిని,కాజల్ వంటి వారు తమకి కమల్ ఏం వేషాలిస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. అంతేగాక ఇంకా తమిళనాట హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ మరికొంత మందిని ఈ సినిమాలో నటింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని ఇంటీరియర్ ప్లేస్ ల్లో చేస్తారని తెలుస్తోంది. ఇక ఏడవ శతాబ్దంలో ఈ చిత్ర కథ జరుగుతూంటుంది. కమల్ ఈ చిత్రానికి దర్శకత్వ భాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X