»   » కొత్త ట్విస్ట్: రజనీ ని డైరక్ట్ చేయటానికి వీల్లేదు...నిర్మాత అల్టిమేటం

కొత్త ట్విస్ట్: రజనీ ని డైరక్ట్ చేయటానికి వీల్లేదు...నిర్మాత అల్టిమేటం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పి.ఎ రంజిత్ డైరక్షన్ లో రజనీకాంత్ చిత్రం చేయటానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తమిళంలో పెద్ద నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజా ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నట్లు చెన్నై సినీ వర్గాల సమాచారం. ఎందుకంటే తమ స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ...సూర్య హీరోగా ఓ చిత్రం డైరక్ట్ చేయటానికి రంజిత్ ఎగ్రిమెంట్ రాయటం జరిగింది. దాంతో ఇప్పుడు ఆ ఎగ్రిమెంట్ ని ఉల్లంఘించి...రజనీ ని డైరక్ట్ చేయటమేంటని ప్రశ్నిస్తున్నాడు జ్ఞానవేల్ రాజా.

ఈ మేరకు జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని సైతం రజనీకాంత్ సమక్షానికి తెలియచేసినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో దర్శకుడు రంజిత్ డీలా పడిపోయారు. ఎగ్రిమెంట్ ని కాదని రజనీతో సినిమా చేస్తే వారు ఒప్పుకునేటట్లు లేరు. అలాగని రజనీలాంటి సూపర్ స్టార్ హీరోతో ఒక్కసారి సినిమా చేసే అవకాసం మిస్తైతే ఇక మరోసారి ఇలాంటి అవకాసం రావటం కష్టం. ఈ విషయంలో రజనీ ఏం నిర్ణయం తీసుకుంటారు..ఏ విధంగా సమస్య పరిష్కారమవుతుందనే విషయమై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇలాంటి వాటికో సమస్య ఉంటుంది. అది మరేదో కాదు...రజనీ చిత్రం నిర్మించే అవకాసం స్టూడియో గ్రీన్ కు ఇవ్వటమే అంటున్నారు కొందరు. మరి ఇప్పటికే ఈ చిత్రం నిర్మించటానికి వచ్చిన కలైపులి ధాను కు ఇదే జరిగితే ఏం సమాధానం చెప్పాలి అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్.

Pa Ranjith Cannot Direct Rajinikanth: Producer

ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్. రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
If the latest reports on the upcoming Rajinikanth-Ranjith flick turns out to be true, then Pa Ranjith might lose out on the opportunity to direct the Superstar. In what looks like a shocking report, producer KE Gnanavel Raja of Studio Green has claimed control over Ranjith's actions and is drawing the strings attached to the Madras director away from Rajinikanth's project.
Please Wait while comments are loading...