»   » పాలాభిషేకం చేయించుకుంటున్న హ్యాపీ గర్ల్ తమన్నా

పాలాభిషేకం చేయించుకుంటున్న హ్యాపీ గర్ల్ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష, నమిత, ఇలియానా తర్వాత ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. తాజాగా ఆమె నటించిన పయ్యా(ఆవారా) చిత్రం కట్ అవుట్స్ కు పాలాభీషేకం తమిళనాడులో చేసి తమ అభిమానం చాటుకున్నారు ఆమె ఫ్యాన్ క్లబ్ సభ్యులు. ఆమె అభిమానసంఘం తాజాగా తుత్తుకుడి జిల్లాలో ప్రారంభమయింది. వారు ఆమెకు గోల్డెన్ గర్ల్ అనే బిరుదు కూడా కట్టబెట్టారు. ఈ సంఘానికి అలిగర ఇండియా తంగపదమై తమన్నా రాసిగర్ నరపాని మందరమ్ అని పేరుతో రిజిస్టర్ చేసారు. అంతేగాక రాష్ట్రమంతటా బ్రాంచ్ లు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వారు మొదటి చర్యగా తమ జిల్లాలోని తమన్నా చిత్రం ఆడుతున్న మెయిన్ ధియోటర్స్ వద్ద యాభై అడుగుల కట్ అవుట్స్ పెట్టి పాలాభిషేకం చేసారు.అంతేగాక రాష్ట్రమంతటా అభిమానులందరూ తమన్నా పటాలకు ఈ అభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ..అభిమానులు నాకు ఇంపార్టెంట్. అయితే ఈ కొత్త ప్యాన్ క్లబ్ గురించి నాకు తెలియదు. అలాగే భగవంతుడుకి చేసే పాలాభిషేకం నాకు చేయటం ఎంతవరకూ సబబో వారే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని తమన్నా తెలివిగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తమన్నా...నాగచైతన్య సరసన గీతా ఆర్ట్స్ చిత్రంలో చేస్తోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ సరసన వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందబోయే బద్రీనాధ్ చిత్రంలోనూ ఆమె చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu