అక్కినేని వారసుడితో ప్రముఖ హీరో కూతురు పెళ్లి
దక్షిణాది సినీ పరిశ్రమలో మరో రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. ప్రముఖ హీరో పార్తీబన్ కూతురి వివాహం ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కుమారుడితో జరుగనున్నది. ఈ పెళ్లి వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

పార్తీబన్, సీత కుమార్తె
నటుడు, హీరో పార్తీబన్, ప్రముఖ నటి సీత కుమార్తె కీర్తన్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులే. బాలనటిగా విమర్శల ప్రశంసలందుకొన్నది. మణిరత్నం 2002లో రూపొందించిన అమృత (కన్నాథిల్ ముతమిత్తల్) నటించిన కీర్తన విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.

మణిరత్నం అమృత చిత్రంలో
అమృత చిత్రంతో జాతీయ ఉత్తమ అవార్డును కీర్తన సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత వచ్చిన అనేక అవకాశాలను కీర్తన పక్కన పెట్టింది. మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసింది.

శ్రీకర్ ప్రసాద్ కుమారుడితో
ప్రస్తుతం ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కుమారుడు అక్షయ్ అక్కినేనిని వివాహం చేసుకొన్నన్నది. ఈ వార్తను తమిళ వెబ్‌సైట్ ధ్రువీకరించింది. త్వరలోనే తేదీల ప్రకటన జరుగుతుందని పేర్కొన్నది.

హిందీలో పిజ్లాకు డైరెక్షన్
తమిళంలో ఘన విజయం సాధించిన పిజ్జా చిత్రం ఇటీవల హిందీలో రీమేక్ చేయబడింది. ఆ చిత్రానికి అక్షయ్ అక్కినేని దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో వజీర్, డేవిడ్ చిత్రాలకు దర్శకత్వం విభాగంలో పనిచేశారు.

త్వరలోనే కీర్తన, అక్షయ్ పెళ్లి బాజాలు
కీర్తన, అక్షయ్ వివాహం త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తాజా సమాచారం. ఈ పెళ్లికి తమిళ, హిందీ, తెలుగు భాషలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











