For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రేప్ చేస్తాం.. లైంగికదాడి చేస్తే నడువలేవు.. చంపేస్తాం.. నటికి బెదిరింపులు.. మమ్ముట్టిపై అనుమానం?

  By Rajababu
  |

  కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకొంటున్న సినీ తార పార్వతికి చేదు అనుభవం ఎదురైంది. సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన కసాబా చిత్రంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆమెను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వేధించారు. దీంతో ఈ వ్యవహారం మమ్ముట్టి మెడకు చుట్టుకొన్నది. మమ్ముట్టి స్వయంగా పార్వతిపై ఫ్యాన్స్ ఉసిగొల్పాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై మమ్ముట్టి మౌనం వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఈ వ్యవహారంలో ఏమి జరిగింది?

  మమ్ముట్టి.. కసాబాపై పార్వతి వ్యాఖ్యలు

  మమ్ముట్టి.. కసాబాపై పార్వతి వ్యాఖ్యలు

  పార్వతి, మమ్ముట్టి మధ్య వివాదం చోటుచేసుకోవడానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికగా మారింది. ఈ చిత్రోత్సవంలో పార్వతి మాట్లాడుతూ.. కసాబా టైటిల్‌ను చెప్పకుండా మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి సినిమాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వేదికపై ఉన్న మరో నటి గీతూ మోహన్‌దాస్ ఆ సినిమా పేరు చెప్పమని బలవంతంగా చేయగా కసాబా పేరును పార్వతి చెప్పింది.

   పార్వతిపై మండిపాటు

  పార్వతిపై మండిపాటు

  పార్వతి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మమ్ముట్టి ఫ్యాన్స్, కొందరు సినిమా పరిశ్రమ పెద్దలు మండిపడ్డారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. తొటి నటుడి సినిమాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. పరిశ్రమలో పెద్దలను గౌరవించడం ఎలా అనేది తెలుసుకోవాలి అని పార్వతిపై ఆగ్రహం చేశారు.

   రేప్ చేస్తాం.. లైంగికదాడితో చంపేస్తాం..

  రేప్ చేస్తాం.. లైంగికదాడితో చంపేస్తాం..

  అంతేకాకుండా రేప్ చేస్తాం. సారీ చెప్పకపోతే చంపేస్తాం. దారుణంగా లైంగిక దాడి చేస్తాం. నడువడానికి చాలా కష్టపడాలి. మేం లైంగిక దాడి చేస్తే రుతుక్రమం కూడా దెబ్బతింటుంది అని నటి పార్వతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మమ్ముట్టికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమెకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై సూపర్‌స్టార్ల ఫ్యాన్స్‌లా ఆగడాలు ఎక్కువయ్యాయనే వాదన వినిపిస్తున్నది.

   వివాదంపై పార్వతి

  వివాదంపై పార్వతి

  తాజా వివాదంపై పార్వతీ స్పందించింది. కసాబాలో పనిచేసిన నటీనటులను గానీ, మమ్ముట్టిని కించపరచడం నా ఉద్దేశం కాదు. యాదృచ్చికంగా ఇది జరిగింది. దానిపై ఇంత రాద్దాంతం చేయడం సమంజసమా? నన్ను ఆంటీ అని, కోతి అని పిలుస్తున్నారు అని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది.

   ఇది దిలీప్ లాంటి కథే

  ఇది దిలీప్ లాంటి కథే

  గతంలో సూపర్‌స్టార్ దిలీప్‌పై వ్యాఖ్యలు చేసిన మరో నటిపై లైంగికదాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ జైలుకెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా పార్వతి ఘటన కూడా అదే మాదిరిగా ఉందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

   పార్వతికి కళాకారులు అండ

  పార్వతికి కళాకారులు అండ

  పార్వతీ తీవ్రమైన హెచ్చరికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కవులు, కళాకారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే మమ్ముట్టి మాత్రం ఈ వివాదంపై నోరు విప్పడం లేదు. అయితే పార్వతిపై అనుచిత వ్యాఖ్యలు ఊపందుకోవడం ఈ వివాదంలో సరికొత్త ట్విస్ట్‌గా కనిపిస్తున్నది.

   పార్వతి వివాదంపై మంత్రి స్పందన

  పార్వతి వివాదంపై మంత్రి స్పందన

  పార్వతి, మమ్ముట్టి వివాదంపై కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ వివాదంలో బెదిరింపులకు పాల్పడుతున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సైబర్ పోలీసులకు మంత్రి సూచించాడు. ఎవరైనా తన అభిప్రాయాన్ని చెబితే ఎదురుదాడి చేయడం తప్పు. ఎంతో ప్రతిభావంతురాలైన పార్వతిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అని మంత్రి థామస్ విచారం వ్యక్తం చేశారు.

  English summary
  Actress Parvathy, who is known for her commendable choice of films, has been on the receiving end of abuse and trolling online ever since she called out misogynistic lines in actor Mammootty's film, Kasaba. Some of the persons warned that I will f**k you (his woman superior) so hard that you'd find it extremely difficult to walk. I will hurt you so badly that your menstrual cycle would go for a toss.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more