twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాత బాకీల పోటు.. ‘విశ్వరూపం’ నిషేధించాలని పిటిషన్

    By Srikanya
    |

    చెన్నై : కమల్ హాసన్ తాజా చిత్రం విశ్వరూపం చిత్రం విడుదలను నిషేధించాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖ లయ్యింది. సాయిమీరా ప్రొడక్షన్‌కు చెందిన రాజేంద్రజైన్ విశ్వరూపం చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో తమ బాకీలు చెల్లించకుండా కమల్ తాజా చిత్రం విడుదల చేయరాదని పేర్కొన్నారు. తాము గతంలో కమల్‌హాసన్ హీరోగా మర్మయోగి చిత్రాన్ని నిర్మించామన్నారు. అయితే ఆ చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు.

    చిత్ర నిర్మాణం ఆగిపోతే ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ ఖాతాలో వేసుకునేలా ఆయనతో ఒప్పందం ఉందని,దాన్ని కమల్ ఉల్లంగిస్తున్నారని తెలిపారు. మర్మయోగి చిత్రం ఆగిపోవడం వల్ల దాని వ్యయం 13.5 కోట్లు కమల్ తమ సంస్థకు తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. కమల్ ఇప్పుడు రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై విశ్వరూపం చిత్రాన్ని నిర్మించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు.

    ఈ చిత్రం విడుదలైతే తమకు ఇవ్వవలసిన రూ.13.5 కోట్లు తిరిగి రావని పేర్కొన్నారు. తమకు డబ్బు చెల్లించేవరకు విశ్వరూపం చిత్రం విడుదలను నిషేధించాలని, డీటీహెచ్ ద్వారా విడుదలను కూడా నిషేధించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు వెంకట్రామన్, వాసుకి దీనిపై జనవరి 3లోపు వివరణ ఇవ్వాల్సిందిగా కమల్‌హాసన్, చారుహాసన్‌లకు నోటీసులు జారీ చేశారు.

    విశ్వనటుడు' కమల్‌హాసన్‌ స్వీయ దర్శక నిర్మాణంలో నటిస్తున్న 'విశ్వరూపం' చిత్రాన్ని డీటీహెచ్‌లో విడుదల చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రారంభంలో ప్రకటించారు. అంతకన్నా ముందే 10వ తేదీ రాత్రి 9 గంటలకు డీటీహెచ్‌ ద్వారా బుల్లితెరల్లో ప్రదర్శించనున్నారు. డీటీహెచ్‌లో ఒక్కో కనెక్షన్‌కురూ.1000 వసూలు చేయనున్నారు. డీటీహెచ్‌లో విడుదలను థియేటర్‌ యజమానుల సంఘం వ్యతిరేకిస్తోంది.

    ఎన్ని అడ్డంకులొచ్చినా తప్పకుండా డీటీహెచ్‌లో విడుదల చేస్తానని కమల్‌ పట్టుబట్టారు. దీనిపై థియేటర్‌ యజమానులు మళ్లీ ఒక విడత చర్చలు జరిపి.. 'కమల్‌ అలాగే చేస్తే అసలు సినిమానే విడుదల చేయమ'ని ఇటీవల ప్రకటన విడుదల చేశారు. అలాంటి పరిస్థితే వస్తే అసలు నా చిత్రం థియేటర్లలో విడుదల కావాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారట కమల్‌. 'విశ్వరూపం' నా ఆస్తి. దాన్ని ఎలాగైనా విడుదల చేస్తానని చెబుతున్నారట కమల్‌.

    English summary
    A petition has been filed in a Chennai High court seeking an immediate stop on Viswaroopam film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X