»   »  నయనతార షాకింగ్ గెటప్(ఫొటో)

నయనతార షాకింగ్ గెటప్(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై:ముప్పై ఏళ్ల వయస్సులో కూడా నయనతార యువతరానికి కలల రాణిగా వెలగొందుతోంది. దానికి తోడు అమె విభిన్నమైన గెటప్ లలో అలరించే ప్రయత్నం సైతం చేస్తోంది. తాజాగా తాను చేస్తున్న మాయ చిత్రంలో ఈ విధంగా ఆమె కనిపించి అలరించే ప్రయత్నం చేసింది. అశ్విన్ శరవణ్ డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది . అలాగే మరో ప్రక్క వెంకటప్రభు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. అందులో సూర్య హీరో. ఆ చిత్రంలో ఆమె కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఆమెకు సంభందించిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తిరుగుతూ అందరినీ అలరిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కాలానికి తగ్గట్టు తమను తాము మలచుకోకపోతే.. రాణించడం సాధ్యం కాదని నయనతార కి తెలిసినట్లు మరొకరకి తెలియదేమో. అందుకే అగ్రహీరోలతో ఆడిపాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. కుర్ర హీరోలతోనూ జతకడుతోంది నయన్‌. బాలకృష్ణ-ఎన్టీఆర్‌, వెంకటేష్‌- రాణా.. వంటి బాబాయ్‌- అబ్బాయిలతో జోడీ కట్టిందీ ముద్దుగుమ్మ. రజనీకాంత్‌, ధనుష్‌ల సరసన కూడా ఆడిపాడింది. నయన్‌కి పోటీగా ఎందరొచ్చినా.. ఇప్పటికీ ఆమె క్రేజీ మాత్రం కోలీవుడ్‌లో తగ్గలేదనే చెప్పాలి.

photo: Nayantara’s shocking getup

ఇటీవల నటుడు జై సరసన ఆడిపాడి అందర్నీ ఆకట్టుకుంది. త్వరలో విజయాల వీరుడు విజయసేతుపతితో కూడా కలిసి నటించనుంది. ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నానుం రౌడీ దాన్‌' (నేనూ రౌడీనే) అని టైటిల్‌ పెట్టారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో 'సూదుకవ్వుం' స్టెల్‌లో ఇక్కడ ఎవర్ని కిడ్నాప్‌ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. అందుకు 'నయనతార' అని సమాధానమిచ్చారు విజయ్‌ సేతుపతి.

'నయన్‌ అంటే ఎంత ఇష్టమని' ప్రశ్నించగా.. తెగ సిగ్గుపడిపోయి సమాధానం కూడా చెప్పకుండా దాటవేశారు విజయ్‌. ఈ కార్యక్రమానికి అదో పెద్ద హైలెట్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా విజయ్‌ సేతుపతి కల నెరవేరింది. ఈ విషయాన్ని ధనుష్‌ తన ట్విట్టర్‌లో ప్రస్తావించగా.. అందుకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. వారిలో ఓ వ్యక్తి.. 'కొక్కి కుమార్‌' నిర్మించగా 'సుమారు మూంజి కుమారు' నటిస్తున్నారని చేసిన పోస్టును.. ధనుష్‌ రీట్వీట్‌ చేయడం విశేషం.

నయనతార కెరీర్ విషయంలోనూ కాదు...మాటలలోనూ తన తెలివిని అవసరమైతే ప్రదర్శిస్తుందని మరోసారి రుజువైంది. తనపై వస్తున్న కంప్లైంట్స్ కు ఆమె ఇచ్చిన సమాధానం విని నిర్మాతలకు సౌండ్ లేకుండా పోయింది. ఇంతకి నిర్మాతలకు ఆమెపై కంప్లైంట్ ఏమిటీ అంటే... ఆమె భారీగా రెమ్యునేషన్ తీసుకొంటుంది గానీ, ప్రచారానికి రాదు. సినిమా వేడుకల్లో కనిపించదు. ఇంటర్వ్యూలు ఇవ్వదు.. అని. అయితే ఆమెకు ఆమె ఇచ్చిన కౌంటర్ కి బుర్ర తిరిగుతోంది. ఇంతకీ నయనతార ఏం చెప్పిందో తెలుసా?

photo: Nayantara’s shocking getup

నయనతార మాట్లాడుతూ... ''పాటల వేడుకల్లో ఎప్పుడో గానీ కనిపించను. ఇంటర్వ్యూలు ఇచ్చిందీ తక్కువే. కావాలనే దూరమవుతున్నా. దీనికీ కారణం ఉంది. రోజూ.. ప్రతీసారీ నేనే కనిపిస్తే, ప్రేక్షకులకు బోర్‌ కొట్టేస్తుంది. అస్తమానం చూసిన మొహమే ఏం చూస్తారు? తెరపై ప్రత్యేకంగా, అందంగా కనిపిస్తే చాలు. అంతకు మించి కూడా ప్రేక్షకులు ఏం కోరుకోరు..'' అంది.

అలాగే....పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో నాకు మీడియా అంటే భయం ఉండేది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలిసేది కాదు. అందరి ముందు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థమయ్యేది కాదు. అందుకే బయట కనిపించేదాన్ని కాదు. అది అలా అలా అలవాటైపోయింది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ సమాధానం విన్న తర్వాత ఆమెకు ఏం చెప్పగలరు చెప్పండి.

పెళ్లి గురించి మాట్లాడుతూ.... ''నేను ఎవరిని పెళ్లి చేసుకొంటానన్న విషయాన్ని రాబట్టడానికి రకరకాలుగా అడుగుతున్నారు. ప్రేమ పెళ్లా లేదంటే పెద్దలు కుదిర్చిందా?అని ఆరా తీస్తున్నారు. నాకు మాత్రం ఏం తెలుసు? నేను విధిని నమ్ముతాను. ఆ క్షణంలో ఏం జరిగితే దాన్ని స్వీకరించడానికి సిద్ధపడతాను. ఆ మనస్తత్వంతో ఉన్నాను కాబట్టే... జీవితంలో ఆటు పోట్లు ఎదురైనా వెంటనే కోలుకోగలిగాను'' అని చెప్పుకొచ్చింది నయనతార.

English summary
The above is look from Nayan upcoming flick Maya. This is a horror flick directed by Ashwin Saravanan that shall release in this early 2015.
Please Wait while comments are loading...