»   » దర్శకుడుకి సినీ పరిశ్రమ కన్నీటి వీడ్కోలు(ఫొటోలు)

దర్శకుడుకి సినీ పరిశ్రమ కన్నీటి వీడ్కోలు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సినీయర్‌ దర్శక నిర్మాత రామనారాయణన్‌కు సినీ ప్రముఖులు మంగళవారం అంజలి ఘటించారు. రామనారాయణన్‌ ఆదివారం రాత్రి సింగపూర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయం సోమవారం అర్థరాత్రి చెన్నైలోని స్వగృహానికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం సినీ ప్రముఖులు, బంధువుల సందర్శనార్థం ఉంచారు.


డీఎంకే అధినేత కరుణానిధి, ఆ పార్టీ కోశాధికారి, ఎమ్మెల్యే స్టాలిన్‌, సంగీత దర్శకుడు ఇళయరాజ, నటులు కమల్‌హాసన్‌, విజయకాంత్‌, సత్యరాజ్‌, శిబిరాజ్‌, హాస్యనటుడు గౌండమణి, దర్శకుడు సుందర్‌.సి, నటి కుష్బూ, పాటల రచయిత, నిర్మాత థాణు, స్నేహన్‌లతోపాటు పలువురు సినీ ప్రముఖులు రామనారాయణన్‌ భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు.

మధ్యాహ్నం 4 గంటలకు టీనగర్‌లోని శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. స్లైడ్ షోలో ప్రముఖులు ఫొటోలు...

స్లైడ్ షోలో....

కమల్ హాసన్

కమల్ హాసన్

ప్రముఖ నటుడు కమల్ హాసన్......వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.

కుష్బూ

కుష్బూ

నటి కుష్బు, దర్శకుడు సి.సుందర్ వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. వారితో తమ అనుభంధాన్ని గుర్తు చేసుకున్నారు.

పి.వాసు

పి.వాసు

చంద్రముఖి దర్శకుడు పి.వాసు వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.

సత్యరాజ్

సత్యరాజ్

ప్రముఖ తమిళ,తెలుగు నటుడు సత్యరాజ్ వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు.

ఉదయ్ నిధి స్టాలిన్

ఉదయ్ నిధి స్టాలిన్

తెలుగులో ఓకే ఓకే చిత్రం చేసిన ఉదయనిధి స్టాలిన్...వచ్చి నివాళి అర్పించారు.

దర్శకుడు

దర్శకుడు

ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్ వచ్చి అంతిమ నివాళి అర్పించారు

కరుణా నిధి

కరుణా నిధి

ప్రముఖ రచయిత,మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణా నిధి వచ్చి నివాళి అర్పించారు

నాజర్

నాజర్

ప్రముఖ నటుడు నాజర్... వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

 విజయకాంత్

విజయకాంత్

యాక్షన్ చిత్రాల హీరో, ఇప్పటి రాజకీయనాయకుడు విజయ్ కాంత్ వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

 రాధిక

రాధిక

రాధిక,శరత్ కుమార్, విజయ్ కుమార్ వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

ఇళయరాజ

ఇళయరాజ

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

సెంధిల్

సెంధిల్

తమిళ హాస్యనటుడు సెంధిల్ ఆయనకు నివాళి అర్పించారు.

భరత్

భరత్

ప్రేమిస్తే భరత్ వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

అర్జున్

అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ ఆయనకు నివాళి అర్పించారు.

రాజేంద్ర

రాజేంద్ర

ప్రేమ సాగరం దర్శకుడు,శింబు తండ్రి అయిన టి రాజేందర్...వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

కోవై సరళ

కోవై సరళ

ప్రముఖ తమిళ,తెలుగు హాస్యనటి కోవై సరళ వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

 లారెన్స్

లారెన్స్

నటుడు,దర్శకుడు, డాన్స్ మాస్టర్ అయిన లారెన్స్ ఆయనకు నివాళి అర్పించారు.

రామనారాయన్

రామనారాయన్

రామనారాయన్ తన కెరీర్ లో 125 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో ఎక్కువ చిత్రాలు దర్శకత్వం వహించిన దర్శకుడుగా రికార్డు క్రియేట్ చేసారు. ఆయన సినిమాలు ఎక్కువ జంతువులు చుట్టూ తిరుగుతూండేవి. తెలుగులోనూ ఆయన రూపొందించన చిత్రాలు పెద్ద హిట్టయ్యాయి. ఆయన చివరి చిత్రం ఆర్య సూర్య. ఆయనకు తమిళనాడు ప్రభుత్వం నుంచి పలు అవార్డులు అందుకున్నారు.

English summary
Tamil celebrities paid their homage to Rama Narayanan, who died of cardiac arrest on Sunday (June 22). He passed away at a private hospital in Singapore. His mortal remains were brought to India on Monday. The final rites will be performed as per the Hindu customs today (June 24). His body was kept at his residence for people to pay homage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu