»   » ఉలా షూటింగ్: లుంగీలో చించేసిన బ్రేవో (పిక్చర్స్)

ఉలా షూటింగ్: లుంగీలో చించేసిన బ్రేవో (పిక్చర్స్)

By Pratap
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: వెస్టిండీస్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ డ్వైన్ బ్రోవో తన 30 జన్మదినం రోజు సోమవారం తమిళ సినిమా ఉలా షూటింగ్‌‌లో పాల్గొన్నాడు. తాను షూటింగ్‌లో పాల్గొనడానికి ముందు ఆ విషయంపై ఆయన ట్వీట్ చేశాడు. ఈ రోజు షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నానని, తన జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం గొప్పగా ఉందని ఆయన అన్నాడు.

  "థ్యాంక్స్ ఇండియా! లైట్స్, కెమెరా, యాక్షన్ టైమ్, చెన్నై కొత్త ఫిల్మ్ స్టార్" అని కూడా ట్వీట్ చేశాడు. జర్మనీ అవార్డు విజేత సూపర్ స్టార్ బీనీ మ్యాన్‌తో కలిసి బ్రోవో ఇదివరకే రెండు సింగిల్స్‌ను విడుదల చేశాడు. తమిళ సినిమా ఉలాలో ప్రత్యేకంగా రూపకల్పన చేసిన పాటలో ఆయనను తీసుకున్నారు.

  డ్రీమ్‌బ్రిడ్జి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎల్వీ శ్రీకాంత్ లక్ణ్మణ్ నిర్మిస్తున్న రాజన్ మాధవ్ సినిమా అది. చలనచిత్రంలో నటించడం బ్రేవోకి ఇదే మొదటిసారి. భారతీయ సినిమాల ద్వారా చిత్రరంగంలోకి రావడం సరైందని బ్రేవో భావిస్తున్నాడు.

  తమిళనాడు ప్రజలకు బ్రేవో బాగా తెలుసు. అతను ఐపియల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. మంచి ఆటగాడే కాకుండా డ్యాన్సర్‌ కూడా. ఇప్పుడు తన సెకండ్ హోమ్‌గా అనిపిస్తోందని, ఈ అవకాశం తన ఏజెంట్ కల్పించినప్పుడు థ్రిల్లయ్యానని, ఐపియల్ జట్టు సభ్యుడిగా చెన్నైతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన మీడియా సమావేశంలో అన్నాడు.

  ధోతీ ధరించాడు

  ధోతీ ధరించాడు

  బ్రేవో సంప్రదాయబద్దమైన ధోతీలో పాటకు డ్యాన్స్ చేశాడు. తన కొత్త సినిమా కోసం స్టూడియోలో కఠిన శ్రమ చేస్తున్నానని, తన జన్మదినాన్ని ఇండియాలో జరుపుకుంటున్నానని అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

  బ్రేవోలో ఉత్కంఠ

  బ్రేవోలో ఉత్కంఠ

  చెన్నై ప్రజలను, భారత ప్రజలను తాను ప్రేమిస్తానని, తన తొలి సినిమాలో గౌరవనీయమైన, ప్రతిభ గల తారలతో, సిబ్బందితో పనిచేస్తున్నానని ఆయన అన్నాడు.

  అనాథ శరణాలయం సందర్శన

  అనాథ శరణాలయం సందర్శన

  అనాథ శరణాలయాన్ని సందర్శించానని, తన జన్మదినం రోజు ప్రియమైన ఈ పిల్లలకు ఏదో ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చానని ఆయన ట్వీట్ చేశాడు.

  అనుకోకుండా జరిగింది....

  అనుకోకుండా జరిగింది....

  జన్మదినం రోజు సినిమాలో నటించడం ఏ మాత్రం అనుకోకుండా జరిగిపోయిందని, మైలు రాయిని చేరుకోవడానికి ఇది ప్రత్యేకమైందని బ్రేవో ప్రితనిధి అమ్మా ఎవరెట్ అన్నారు.

  ఏదో ఒకటి చేస్తాను..

  ఏదో ఒకటి చేస్తాను..

  తన జన్మదినం రోజు యేటా ఏదో ఒకటి చేస్తానని, తనకన్నా తక్కువ అదృష్టాన్ని వరించినవారికి ఏదో ఒకటి చేయడానికి తగినంత తనకు ఉండడం జీవితంలో అదృష్టమని ఆయన అన్నాడు.

  English summary
  West Indies Cricket ODI Captain and one of the biggest sporting stars to emerge from the Caribbean in recent times, Dwayne Bravo spent his 30th birthday on Monday (October 7) by taking part in the shoots of Tamil movie Ula.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more