»   »  హిమాలయాల్లో రజని ఏం చేస్తారు? షాకిస్తున్న ఫోటోలు!

హిమాలయాల్లో రజని ఏం చేస్తారు? షాకిస్తున్న ఫోటోలు!

Subscribe to Filmibeat Telugu
హిమాలయాల్లో రజని ఏం చేస్తారు? షాకిస్తున్న ఫోటోలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ సినీతారలందరిలోకి భిన్నమైన వ్యక్తి. ఇండియా మొత్తం రజినీకాంత్ ని సూపర్ స్టార్ అని కీర్తిస్తున్నా ఆయన మాత్రం హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. రజనీకాంత్ సంప్లిసిటీ మిగిలిన తారలని, అభిమానులని అబ్బుర పరుస్తుంది. రజని ఆర్భాటాలు మొత్తం సినిమా వరకు మాత్రమే పరిమితం. ఆఫ్ స్క్రీన్ లో ఆయన సర్వసాధారణమైన వ్యక్తిగా కనిపిస్తారు. రజని తన మానసిక ప్రశాంతత కొరకు విదేశీయానాలు గట్రా చేయరు. మానసిక ప్రశాంతర కోరుకున్నప్పుడు నేరుగా హిమాలయాలు వెళ్ళిపోతారు. చాలా ఏళ్ల క్రితం నుంచి రజనీకాంత్ హిమాలయాలకు వెళుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కూడా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. హిమాలయాల్లో గడుపుతున్న రజని ఫోటోలు సోషల్ మీడియాలో వవైరల్ గా మారాయి.

 సినీ ప్రపంచంలో రారాజు, కానీ

సినీ ప్రపంచంలో రారాజు, కానీ

రజనీకాంత్ కు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు కోట్లల్లో ఉన్నారు.రజని సినీప్రపంచంలో రారాజు అయనప్పటికీ సర్వసాధారణమైన వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడుతారు. అందుకే కోట్లాదిమంది అభిమానులు రజనీకాంత్ ని ఆరాధిస్తారు.

 ఇంత సాధారణమైన జీవితం ఎందుకు అంటే

ఇంత సాధారణమైన జీవితం ఎందుకు అంటే

రజనీకాంత్ రియల్ లైఫ్ లో తనలా ఉండడానికే ఇష్టపడుతారు. సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్న రజని ఇంత సింపుల్ గా ఎందుకు అని ప్రశ్నిస్తే చాలా చాలా సార్లు ఆయన ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చారు. ఓ గుడివద్ద తాను కూర్చుని ఉంటె ఓ మహిళా బిచ్చగాడు అనుకుని పది రూపాయలు ఇచ్చి వెళ్ళింది. మేకప్ లేకపోతే నేను ఇంతేనా అనిపించింది. అందుకే తాత్కాలికమైన వాటిని నిజజీవితంలో దరిచేరనీయనని రజనీకాంత్ అన్నారు.

హిమాలయాలకు తరచుగా

హిమాలయాలకు తరచుగా

రజనీకాంత్ మానసిక ప్రశాంతత కోసం తరచుగా హిమాలయాలకు వెళుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇటీవల కూడా రజని హిమాలయాల బాట పట్టారు. రజని హిమాలయాల్లో గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 ఈ సారి చాలా ప్రత్యేకం

ఈ సారి చాలా ప్రత్యేకం

రజినీకాంత్ హిమాలయాలకు వెళ్ళిన ప్రతిసారి అభిమానుల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఈ సారి ఆ చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది.ఎందుకంతే రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లడం ఇదే తొలిసారి. దీనితో ఆయన తిరిగి వచ్చి పెద్ద ప్రకటన చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 బాబా ఆశ్రమంలో

బాబా ఆశ్రమంలో

రజనీకాంత్ హిమాలయాల్లో మాధవతార్ బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనకు రజని భక్తుడు. రజనీకాంత్ హిమాలయ కొండల్లో వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

English summary
Rajinikanth at Himalayas. Photos goes viral in net
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu