డబ్బింగ్,రీమేక్ రైట్స్ తో నా బడ్జెట్ వచ్చేసింది
పిజ్జా ఒరిజనల్ నిర్మాత మాట్లాడుతూ..." కన్నడ రైట్స్ ని 35 లక్షలకు ఇచ్చాం. ప్రశాంత్ అనే నిర్మాత చిత్రం చూసి తీసుకున్నారు. ఆయన కన్నడంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగుకి సురేష్ కొండేటి తీసుకున్నారు. ఆయన 72 లక్షలు పే చేసారు." అన్నారు. ఇక సురేష్ కొండేటి గతంలో ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ, నాన్న వంటి హృద్యమైన చిత్రాలను ఆయన తెలుగులో అందించారు. తెలుగు వెర్షన్ కి ఇంకా పేరు నిర్ణయించ లేదు.
ఈ సినిమా గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ -''ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్.ఇప్పటివరకూ ఇలాంటి కథతో తెలుగులో సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను. బలమైన కథ, పకడ్బందీ కథనం ఈ సినిమాకు ప్రధాన బలాలు. తమిళ పేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారంటే కారణం అదే. వాస్తవానికి చాలా దగ్గరగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకే సన్నివేశాలు ఇందులో కోకొల్లలు.
సంతోష్‌నారాయణన్ ఇచ్చిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్.ఇందులో ఎనిమిదిపాటలుంటాయి. నేపథ్య సంగీతం కథకు మరింత బలాన్నిచ్చింది. ఉత్తమాభిరుచితో ఇప్పటిదాకా మేం అందించిన చిత్రాలకు ధీటుగా ఈ సినిమా ఉంటుంది. ఎంతో పోటీని తట్టుకొని ఈ సినిమా హక్కులు సంపాదించాం. రీమేక్ చేయాలా, డబ్బింగ్ చేయాలా అనేది ఇంకా నిర్ణయించలేదు''అని తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పి. సమన్యరెడ్డి.


Click it and Unblock the Notifications












