»   » నటితో పెళ్లి ..11 మంది టెక్కీల కు ట్విస్ట్...డబ్బుతో పరారు

నటితో పెళ్లి ..11 మంది టెక్కీల కు ట్విస్ట్...డబ్బుతో పరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మోసాలు రూపు రేఖలు మారతున్నాయి. జనాలకు ఉన్న అవసరాలు, వ్యామోహాలు ను అడ్డం పెట్టి మోసాలు పెచ్చుమీరుతున్నాయి. రీసెంట్ గా పెద్ద చదువులు చదువుకుని,సాప్ట్ వేర్ ఇంజినీర్స్ గా చేస్తున్న 11 మందిని తాను నటిని అని చెప్పి, ప్రేమ నటించి, అవసరాలంటూ డబ్బు వసూలు చేసి, శ్రుతి అనే అమ్మాయి పరారైంది.

వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తివేలూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంతోష్‌కుమార్(40) వధువు కోసం మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకున్నారు.ఓ సైట్ ద్వారా ద్వారా కోవై,పిళమేడుకు చెందిన నటి శ్రుతి ఆయనకు పరిచయమయ్యింది.

ఆమె సంతోష్‌కుమార్‌ను పెళ్లి చేసుకుంటానని ఆయనతో సన్నిహితంగా మెలిగింది. మెల్లిగా ఇంట్లో సమస్యలు అని చెప్పి.. ఓ యేడాది సమయం అడిగి, అతని నుంచి 43 లక్షల వరకూ గుంజింది.ఆ తరువాత కనిపించకుండా పోయింది. అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.

Police Hunt on for Kovai’s runaway bride Shruthi

మరో ప్రక్క... చిదంబరం, శివశక్తి నగరానికి చెందిన అరుళ్‌కుమార్ రాజానూ పెళ్లి చేసుకుంటానని శుత్రి రూ.50 లక్షల వరకూ మోసం చేసిందని కంప్లైంట్ నమోదు అయ్యింది. నటితో పెళ్లి అనేసరికి ఈ సాప్ట్ వేర్ ఇంజినీరు మోసపోయాడు.

అలాగే చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్(28),ప్రసాద్(31) శనివారం కోవై పోలీసులకు శ్రుతిపై కంప్లైంట్ చేశారు.అందులో నటి శ్రుతి తనని వివాహం చేసుకుంటానని చెప్పి లక్షల్లో మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదైన ఫిర్యాదు ప్రకారం శ్రుతి 11 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పెళ్లి చేసుకుంటానని రెండు కోట్లకు పైగా కాజేసినట్లు వెల్లడైంది.

ఇంతకీ ఆమె నటి అయితే ఏ సినిమాలో నటించింది,లేక కేవలం జూనియర్ ఆర్టిస్టా అనే విషయాలు మాత్రం బయిటకు రాలేదు. అయితే ఆమె సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుందని తెలిసింది. తన అందం ఎరపెట్టి, వివాహం కాని కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసి, డబ్బు లాగటమే ఆమె వృత్తి అని తేలింది.

English summary
City police has launched a search for a 20-year-old girl Shruthi who allegedly cheated several eligible grooms with the promise of marriage. Shruthi introduced herself as a film actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu