»   »  లారెన్స్‌ను 2 గంటలు పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ, ఇండస్ట్రీ షాక్

లారెన్స్‌ను 2 గంటలు పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ, ఇండస్ట్రీ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: వేందర్ మూవీస్ మదన్‌.. ఇటీవల ఐదు పేజీల లేఖను మీడియాకు విడుదల చేసి మాయం అయిపోయిన విషయం తెలిసిందే. అందులో తాను కాశీలో తనువు చాలిస్తానని పేర్కొన్నారు. అయితే ఆయన మిస్ అవ్వటం ఇప్పుడు ప్రముఖ నృ త్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ కు తలనొప్పిగా మారింది.

మదన్ తో సంబంధాలున్నాయన్న సందేహంతో లారెన్స్‌ను క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సోమవారం రెండు గంటల పాటు విచారించారు. ఈ సంఘటన తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనానికి దారి తీసింది.

మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు మదన్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు మదన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నా ఇప్పటికీ ఆచూకి కనుగొనలేదు.కాగా మదన్ ఇద్దరు భార్యాలను,ఆయన తల్లిని విచారించిన పోలీసులు సోమవారం మదన్‌తో సంబంధాలున్నాయన్న సందేహంతో లారెన్స్‌ను రెండు గంటల పాటు విచారించారు. ఈ విచారణ పోలీస్‌కమిషన్ కార్యాలయంలో జరిగింది.

మదన్‌కు చెందిన రెండు కార్యాలయాల్లోనూ పోలీసులు తీవ్రంగా శోధన చేశారు. అప్పుడు విద్యార్ధుల తల్లిదండ్రులు నుంచి వసూలు చేసిన పలు బ్యాంక్ డ్రాఫ్ట్‌లు బయట పడ్డాయి. దీంతో మదన్‌కు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం గ్రూప్‌నకు గల సంబంధాలు బయట పడినట్లు తెలియవచ్చిందని పోలీస్ వర్గాలు తెలిపారు.దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందని అన్నారు.

police investigate Raghava lawrence

ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో వైద్య విద్యకు విద్యార్థులు సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేందర్‌మూవీస్ అధినేత మద న్ అదృశ్యమై 25 రోజులు దాటినా ఆయన ఆచూకీ తెలియలేదు.

ఈ వ్యవహారంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుల మేరకు మదన్, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ అధినేత పచ్చముత్తులపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఆయన అదృశ్యం అయినప్పటి నుంచి లేఖలోని అంశాలు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీటు కోసం ఫీజులు చెల్లించిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.మరోపక్క మదన్ భార్యలిద్దరూ తమ భర్త ఆచూకీ కనుగొని తమకు అప్పగించాల్సిందిగా పోలీస్ క మిషనర్‌ను కోరారు.

English summary
Raghava Lawrence has teamed up with Vendhar Movies for his next. So Crime Branch police investigate Raghava lawrence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu