»   » అప్పుడే పైరసీనా...దేముడా

అప్పుడే పైరసీనా...దేముడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సేలం : 'కోచ్చడయాన్‌'(తెలుగులో విక్రమ్ సింహా) చిత్ర పైరసి సీడీలను విక్రయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన కోచ్చడయాన్‌ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. చిత్రం విడుదలై ఒకరోజైనా గడవక ముందే కొందరు పైరసి సీడీలను తయారు చేసి దుకాణాల్లో విక్రయించసాగారు. దీనిని గుర్తించిన రజినికాంత్‌ అభిమానులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంబంధిత దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి సుమారు రెండు వేల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాదారులు కార్తిక్‌, మోహన్‌రాజ్‌లను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

కథ విషయానికొస్తే... కలింగపురం, కోట పట్టణం అనే రెండు రాజ్యాల మధ్య తరతరాలుగా శతృత్వం ఉంటుంది. కోట పట్టణం రాజ్యానికి రాజు ఉగ్ర సింహా(నాజర్), కలింగపురానికి రాజు రాజ మహేంద్రుడు(జాకీ ష్రాఫ్). కలింగపురానికి వీరుడు ధీరుడు అయిన రాణా అలియాస్ రణధీర(రజనీకాంత్) సర్వ సైన్యాధిపతి. రాణా నాయకత్వంలో కలింగపురం సేనలు శతృ దేశాలను ఓడిస్తాయి. కోట పట్టణంతో యుద్ధం సమయం వచ్చే సరికి ఉన్నట్టుండి రానా కలింగపురం నుండి కోటపట్టణం వైపుషిప్ట్ అవుతాడు. కోట పట్టణంలో సైన్యాధికారిగా నియమితుడవుతాడు. రాణా ఇక్కడికి వచ్చిందే కోటపట్టణం రాను ఉగ్రసింహను చంపడాని. రాణా ఇలా చేయడానికి కారణం అతని తండ్రి విక్రమ సింహ ఫ్లాష్ బ్యాక్......పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Police seized the Kochadaiyaan piracy CD’s

ఈ సినిమాలో రజనీ సరసన దీపికా పదుకొణే నటించింది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. సునీల్‌ లుల్ల నిర్మాత. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచిన పాటల్ని రీసెంట్ గా విడుదలయ్యాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు.

English summary
As we all know Indian Film Industry is suffering a lot from Piracy. Now it’s the turn of Rajanikanth’s Kochadaiyaan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu