»   » షాకింగ్: హీరో ఆర్యకు పబ్లిక్‌గా హీరోయిన్ పెళ్లి ప్రపోజల్

షాకింగ్: హీరో ఆర్యకు పబ్లిక్‌గా హీరోయిన్ పెళ్లి ప్రపోజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరో ఆర్యకు హీరోయిన్ పబ్లిక్‌గా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ హీరోయిన్ పూజ. ఈ అమ్ముడు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అయితే రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంలో టీచర్‌గా గెస్ట్ పాత్రలో కనిపించింది. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

స్నేహాన్ని వ్యక్త పరచడానికి ఎల్లో ప్లవర్, ప్రేమను వ్యక్త పరచడానికి రెడ్ ఫ్లవర్, పెళ్లి ప్రపోజల్‌కు వైట్ ఫ్లవర్ ఇస్తారనే విషయం తెలిసిందే. ఈ మూడు ఫ్లవర్స్ ఇవ్వాల్సి వస్తే మీరు ఎవరికి ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ....హీరో భరత్‌కు ఎల్లో ఫ్లవర్, విశాల్‌లకు రెడ్ ఫ్లవర్, ఆర్యకు వైట్ ఫ్లవర్ ఇస్తానని చెప్పుకొచ్చింది.

ఆర్య తనకు చాలా కాలం నుంచి సుపరిచితమని...నా యొక్క ఇష్టాలు, అయిష్టాలు అతనికి బాగా తెలుసు అని పూజా చెప్పడం గమనార్హం. మరి పూజా ఈ విషయాలు సరదాగా చెప్పిందో? లేక తన మనసులో ఆర్యను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను ఈ సందర్భంగా బయటపెట్టిందా? అనేది చూడాలి.

పూజా గురించి వివరాల్లోకి వెళితే...శ్రీలంకలోని కొలంబొలో జన్మించింది. ఆమె తల్లి శ్రీలంకన్. తండ్రి ఉమాశంకర్ కన్నడ బ్రాహ్మిణ్. తమిళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పటి వరకు 20 చిత్రాల్లో నటించింది. అందులో శ్రీలంక భాష, మళయాల, ఇంగ్లీష్ బాషలకు చెందిన చిత్రాలు కూడా ఉన్నాయి.

English summary
The beautiful actress Pooja who stunned the Kollywood industry with Bala’s Naan Kadavul has made a huge comeback of sorts with the recently released Vidiyum Munn. The actress in a recent television interview openly proposed to Arya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu