»   » పూనమ్ బజ్వా మళ్ళీ కచేరీ ఆరంభం

పూనమ్ బజ్వా మళ్ళీ కచేరీ ఆరంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున బాస్, రాజాతో వేడుక, అల్లు అర్జున్ పరుగు, నవదీప్ తో మొదటి సినిమా వంటి చిత్రాల్లో చేసినా క్లిక్ కాలేక ఫేడ్ అవుట్ అయిన పూనమ్ బజ్వా మళ్ళీ తెలుగు తెరను పలకరించనుంది. అయితే ఈ సారి తమిళ డబ్బింగ్ లో ఆమె కనిపంచనుంది. ఆమె తమిళ నటుడు జీవా తో కలిసి నటించిన కచేరి ఆరంభం చిత్రం తెలుగు లోకి డబ్బింగ్ అవుతోంది. క్రిందటి శుక్రవారం రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో వడివేలు చేసిన పోర్షన్ ని బ్రహ్మానందం మీద చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కథ అచ్చ తెలుగు కథలా నడుస్తుంది. ఈ సినిమా ప్రారంభంలో హీరో ఎన్నో సినిమాల్లో లాగానే ఉద్యోగం కోసం చెన్నై ప్రయాణమై వస్తాడు. అక్కడ బర్మా బజార్ లో షాపు నడుపుకుంటున్న వడివేలు వద్ద ఉద్యోగంలో చేరుతాడు. అప్పుడు హీరోయిన్ పూనమ్ బజ్వా ఎదురవతుంది. ఆమె అతన్ని ఓ రోడ్ ఏక్సిడెంట్ లో సేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె పై పిచ్చి ప్రేమల పడిపోతాడు హీరో. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెల్ళి ఆమెను ప్రేమిస్తున్నానంటాడు. ఆమె అతన్ని ఎవాయిడ్ చేస్తుంది. ఎందుకూ అంటే ఓ ప్లాష్ బ్యాక్. ఆమెను శివమణి అనే విలన్ (జెడి చక్రవర్తి) గాఢంగా ప్రేమిస్తూంటాడు. శివమణి లోకల్ గా పెద్ద డాన్. ఆమె వంక చూసిన వాళ్ళను అతను బ్రతకనీయుడు. ఆ క్రమంలో అప్పటికే ఇద్దరు చచ్చిపోయుంటారు. దాంతో హీరో ని కూడా చావనీయకూడదని ఆమె ఆపుతూంటుంది. ఇక ఓ రోజు ఆ విషయం తెలుసుకున్న జీవా అర్జెంటు గా ఓ ప్లాన్ వేసి విలన్ గ్యాంగ్ లో చేరిపోతాడు. అక్కడ శివమణి నమ్మకాన్ని పొంది అతని పొజీషన్ కే తన కుయుక్తులతో ఎసరు పెడతాడు. అలా విలన్ ని తన తెలివితో నాశనం చేసి తన గర్లెప్రెండ్ ని సొంతం చేసుకుంటాడు. ఇక ఈ కధలో ఉన్న వడివేలు ట్రాక్ మొత్తాన్ని బ్రహ్మానందం మీద చిత్రీకరించి ఏప్రియల్ చివరి వారంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక పూనమ్ బజ్వా ఇంతకు ముందు మొదటి సినిమా, బాస్ వంటి చిత్రాల్లో చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X