ప్రముఖ రచయిత బాలమురగన్ కన్నుమూత.. ఆ సూపర్ స్టార్‌ 35 సినిమాలకు కథలు!

తమిళ, తెలుగు సినిమా రంగంలో పలు విజయవంతమైన చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత బాలమురగన్ ఇకలేరు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన జనవరి 16వ తేదీ ఉదయం కన్నుమూశారు. బాలమురగన్ మరణ వార్తను ఆయన కుమారుడు భూపతి రాజా ధృవీకరించారు. బాలమురగన్ మరణవార్తతో ఆయన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకొంటున్నారు. బాలమురగన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

బాలమురుగన్ వయసు 86 సంవత్సరాలు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మదాత, అదృష్ట జాతకుడు, కోడలు పిల్ల, జీవన తరంగాలు, బంట్రోతు భార్య, సొగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవనతీరాలు, కాలయముడు, పుణ్యం కొద్ది పురుషుడు, భార్యాభర్తలు సినిమాలకు కథ అందించారు.

Popular Writer Bala Murugan no more, Died at age of 86

తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలందరికి కథలు అందించారు. శివాజీ గణేషన్‌తో బాలమురగన్‌కు మంచి అనుబంధం ఉంది. ఆయన నటించిన 35 చిత్రాలకు బాలమురగన్ కథ అందించారు. దక్షిణాదిలో పలు విజయవంతమైన చిత్రాలకు కథలను అందించిన ఘనత ఆయనకు దక్కింది.

బాలమురగన్ మరణంతో విషాదంలో కూరుకుపోయిన కుటుంబ సభ్యులను తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించారు. కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X