For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవర్‌ స్టార్‌ అరెస్టుకు రంగం సిద్దం

  By Srikanya
  |
  చెన్నై : ప్రముఖ సినీనటుడు పవర్‌స్టార్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌నుఅరెస్టు చేసేందుకు నామక్కల్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. 'కన్నా లడ్డు తిన్న ఆశయా' చిత్రంతో అందర్నీ ఆకట్టుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నటుడు పవర్‌స్టార్‌. నామక్కల్‌ జిల్లా తిరుచ్చెంగోడుకు చెందిన పారిశ్రామికవేత్త పొన్నుస్వామి వద్ద పవర్‌స్టార్‌ 2008లో రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన చెక్కు బౌన్స్‌ కావటంతో పొన్నుస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  కేసు నమోదు చేసిన పోలీసులు పవర్‌స్టార్‌ను అరెస్టు చేసేందుకు కొన్ని రోజుల క్రితం చెన్నై అన్నానగర్‌లో ఆయన ఉంటున్న శాంతికాలనీకి వచ్చారు. పవర్‌స్టార్‌ అండమాన్‌కు వెళ్లినట్లు కుటుంబికులు తెలిపారు. పవర్‌స్టార్‌ చెన్నైలోనే ఉన్నారని పొన్నుస్వామి పేర్కొనడంతో నామక్కల్‌ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో నగరానికి రానున్నారు.

  ఇక 'కన్నా లడ్డు తిన్న ఆశయా'తో పవర్‌స్టార్‌ శ్రీనివాసన్, సంతానం జోడీకి మంచిపేరు వచ్చింది. ఒకరిపై ఒకరు విసురుకునే చెణుకులు నవ్వుల పంట పండిస్తున్నాయి. ఇద్దరూ ఒకేతెరపై కనిపించే అవకాశాలు మరిన్ని వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా వస్తున్న చిత్రం 'యా.. యా..'. 'తమిళ్‌పడం' శివని హీరోగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇదే చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

  దర్శకుడు రాజేష్‌ వద్ద పనిచేసిన రాజశేఖరన్‌ మెగాఫోన్‌ పట్టుకుంటున్నాడు. ఇందులో పవర్‌స్టార్‌ కోసం ప్రత్యేకపాత్ర సృష్టించారట దర్శకుడు. క్రికెట్‌ నేపథ్యంతో సాగే ప్రేమకథ ఇది. ఒక జట్టు ఉప సారథిగా శ్రీనివాసన్‌ కనిపించనున్నారు. మరింతమంది దర్శకులు వారి కోసం స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకుంటున్నారట. గౌండమణి, సెంథిల్‌ను గుర్తుకు తెస్తున్నారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

  రోజు రోజుకూ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. మాస్‌ మసాలా అయినా... కన్నీళ్లు పెట్టించే సెంటిమెంటైనా... భావోద్వేగాలు పలికించే కుటుంబ కథైనా ప్రత్యేక ట్రాక్‌గా కామెడీ జోప్పించే విధానానికి కాలం చెల్లుతోంది. అందుకు ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచే. ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ కాలంలో నగేష్‌.. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ సమయంలో గౌండమణి, సెంథిల్‌... అజిత్‌, విజయ్‌ వచ్చాక వడివేలు, వివేక్‌... ప్రస్తుతం సంతానం తమిళ చిత్రాల్లో హాస్య జల్లులు కురిపిస్తున్నారు. కామెడీ కథలను ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో తమిళ సినిమా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడిలో పయనిస్తోంది. గత ఏడాదంతా కామెడీ చిత్రాలు కాసులు పండించగా, 'కన్నా లడ్డు తిన్న ఆశయా'తో కొత్త సంవత్సరం కూడా అదే దారిలో పయనిస్తోంది.

  English summary
  Power Star Dr Srinivasan against whom an arrest warrant had been issued in connection with a cheque bounce case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X