»   » జైలు ఆశ్రమంలా ఉందని పవర్‌స్టార్‌ వ్యాఖ్య

జైలు ఆశ్రమంలా ఉందని పవర్‌స్టార్‌ వ్యాఖ్య

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Srinivasan
  చెన్నై : పవర్‌స్టార్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌ జామీనుపై విడుదలయ్యాడు. 'లితికా' చిత్రం ద్వారా పరిచయం అవుతూ.. తానో పవర్‌స్టార్‌ అనే పట్టంతో తమిళ ప్రేక్షకుల చెంతకు వచ్చాడు. తర్వాత 'కన్నా లడ్డు తిన్న ఆశయా' ద్వారా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఏకంగా పది చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఐ'లోనూ నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే పలువురికి అప్పు ఇప్పిస్తానంటూ మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టు అయ్యారు. అనంతరం పోలీసులు పుళల్‌ జైలుకు తరలించారు. గురువారం బెయిల్‌పై ఆయన విడుదలయ్యాడు.

  చెన్నై వచ్చిన పవర్‌స్టార్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'కొందరి కుట్ర వల్ల మోసం కేసుల్లో చిక్కుకున్నా. దీనివల్ల సినిమాల్లో నటించలేకపోయాను. నేను గతంలో నటించిన 'ఆర్య సూర్య', 'సుమా నచ్చును ఇరుక్కు', యా యా' చిత్రాలు విడుదలకానున్నాయి. ఇవి నా అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. నేను జైల్లో ఉన్నన్ని రోజులు అధికారులు చాలా స్నేహపూర్వకంగా మెలిగారు. కొందరు నా అభిమానులుగా మారిపోయారు (మీరింకా మారలేదు గురూ!). జైలు నాకో ఆశ్రమంలా అనిపించింది. ఈ సమస్యలను నుంచి త్వరలోనే బయటపడతాను'అని చెప్పారు.

  ఇక శ్రీనివాసన్‌పై రోజురోజుకు ఉచ్చు బిగిస్తోంది. పవర్‌స్టార్‌ వద్ద పనిచేసిన ఏజెంట్‌లను కూడా అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నగదు అవసరమైన వారిని గుర్తించే బాధ్యతను పవర్‌స్టార్‌ తన ఫైనాన్స్‌ సంస్థలో ఏజెంట్‌లుగా వ్యవహరిస్తున్న వారికి అప్పగించినట్లు, వారంతా బాధితులకు మాయమాటలు చెప్పి పవర్‌స్టార్‌ ఉచ్చులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని కూడా అరెస్టు చేసేందుకు జాబితా రూపొందిస్తున్నారు.

  వీరిలో ముఖ్యులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు, చెన్నైకి చెందిన క్రిష్టోఫర్‌ అని గుర్తించారు. తాజాగా ఆయనపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. నగదు మోసం కేసుల్లో అరెస్త్టెన పవర్‌స్టార్‌ ప్రస్తుతం వేలూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. తమను కూడా ఆయన మోసం చేశాడంటూ బాధితులు రోజూ నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఛండీగర్‌కు చెందిన జగదీష్‌సింగ్‌ ఇలా ఇచ్చిన ఫిర్యాదులో.. తనకు రూ.200 కోట్ల రుణం ఇప్పిస్తానని పవర్‌స్టార్‌ నమ్మించాడని ఆరోపించారు. ముందుగానే తన వద్ద రూ.రెండు కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు.

  English summary
  
 After being remanded under custody for Power Star Dr. Srinivasan was released from jail last night. The actor got into a legal soup after being accused of financial fraud by a businessman. The actor can breathe freely for now but he is not completely relieved from the case as it’s still open for hearing soon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more