»   »  రజనీకాంత్‌ను అనుకరిస్తానంటున్న పవర్‌స్టార్‌

రజనీకాంత్‌ను అనుకరిస్తానంటున్న పవర్‌స్టార్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్‌ను అనుకరిస్తూ ప్రముఖ తమిళ కమేడియన్‌ పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ సందడి చేయనున్నారు. రజనీకాంత్‌ కెరీర్‌లో మైలురాళ్లగా నిలిచిన చిత్రాల్లో 'జాని' ఒకటి. ఇందులో ఆయన సెలూన్‌ యజమానిగా చక్కని నటనను కనబర్చారు. ప్రస్తుతం పవర్‌స్టార్‌ అలాంటి పాత్రలోనే కనిపించున్నారట. 'గిటాయ్‌ పూజారి మకుడి'లో ఆయన జానిలో రజనీకాంత్‌ పోలిన క్యాస్టూమ్స్‌తో దర్శనమివ్వనున్నారు. 'కన్నా లడ్డుతిన్న ఆశయా' తర్వాత ఈ పాత్ర తనకు ఎంతో పేరు తెస్తుందని పవర్‌స్టార్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తనకు తానే పవర్ స్టార్ బిరుదు ఇచ్చుకున్న తమిళ కామెడీ హీరో శ్రీనివాసన్. ఆయన ఆ మధ్య తాజాగా ప్రాడ్ కేసులో ఇరుక్కుని అరెస్టు అయ్యారు. ఓ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అరవై ఐదు లక్షలు రూపాయలు చీట్ చేసారని ఆయనపై అభియోగం. తమిళ పరిశ్రమలో యాభై సంవత్సరాలు దాటాక పీల్డులోకి వ్చచి నటిస్తున్న ఈయన ఇంతకుముందు హీరోయిన్స్ నిత్యామీనన్, ప్రియా ఆనంద్ లకు కోటి రూపాయలు ఆఫర్ చేసి తన ప్రక్కన చేయమన్నాడు. అయినా వారెవ్వరూ ముందుకు రాలేదు.

Powerstar acting like Rajinikanth's Jonny movie

ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ కి పోటీ ఎవరు...అంటే...నేనే పవర్ స్టార్ ని పోటీ అంటూ తేల్చి చెప్పాడు తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్. తెరపై స్థిరపడ్డాక బిరుదులు దక్కించుకునేవారు కొందరైతే డా||శ్రీనివాసన్‌ మాత్రం అందుకు భిన్నం. ఆయన తెరంగేట్రమే'పవర్‌స్టార్‌' పేరుతో చేశాడు. మనసులోని మాటను బయటపెట్టేందుకు ఏ మాత్రం తటపటాయించని పవర్‌స్టార్‌ సంచలన వ్యాఖ్యలతో దుమ్మురేపుతున్నాడు.

ఓ తమిళ పత్రికలో ఇచ్చిన ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌కు పోటీ అంటే అది పవర్‌స్టారే అని బాంబు పేల్చాడు. ప్రస్తుతం మరో అడుగు ముందుకేశాడు. ఎవరి సరసన నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు తనదైన శైలిలోసమాధానం ఇచ్చాడు. అనుష్క, హన్సిక, సమంతలు కాదు.. ఐశ్వర్యరాయ్‌ తన సరిజోడీ అని తేల్చాడు.

English summary
Power Star Dr.Srinivasan wants to act like Rajinikanth's Jonny .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu