»   » ఆమె నా పరువుతీసింది..ఆమెతో నేనెలా కాపురం చేయాలి: ప్రముఖ హీరో

ఆమె నా పరువుతీసింది..ఆమెతో నేనెలా కాపురం చేయాలి: ప్రముఖ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవా, నయనతారలపై ప్రభుదేవా మొదటి భార్య రామలత్‌ కేసు పెట్టిన విషయం మీకు తెలిసిందే. నా భర్త నాకు కావాలి.. నా పిల్లలు కూడా తండ్రికి దూరంగా ఉండలేకపోతున్నారని కోర్టుకు మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుదేవా, నయనతారలకు కోర్టు సమన్లు పంపింది. ఒకవైపు ఈ కేసు నడుస్తోంటే మరోవైపు రమలత్‌ ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. రమలత్‌ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ప్రభుదేవా తన దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. కానీ అతని భార్య ఇంటర్వ్యూ ఇచ్చిన పత్రిక మాత్రం విదేశాలకు చేరిపోయింది. ఆ ఇంటర్వ్యూ చదువుకుని ప్రభుదేవా ఆగ్రహంతో ఊగిపోయాడట. ఎంత ధైర్యం ఉంటే ఇలా ఇంటర్వ్యూ ఇస్తుందని సన్నిహితుల దగ్గర ఆ ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. ఇలాంటి భార్య తో నేనెలా కాపురం చేయగలనని కోర్ట్ లో చెబుతా ఇదొక్కటి చాలు..ఈ కేసు నుంచి నేను తప్పించుకోవడానికి అని బెదిరించే టైప్ లో మాట్లాడాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu