»   » నయనతార, ప్రభుదేవా పెళ్లి ఎక్కడ జరుపుకోవాలని తర్జనభర్జనలు..

నయనతార, ప్రభుదేవా పెళ్లి ఎక్కడ జరుపుకోవాలని తర్జనభర్జనలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవాల ప్రేమ విషయమై జరుగుతూ వచ్చిన పేచీ... ఇప్పుడు పెళ్ళి విషయమై జరుగుతోందని తెలుస్తోంది. దాదాపుగా యాభై కోట్ల విలువ చేసే స్థిరచరాస్తులు తన మొదటి భార్యకు రాసిచ్చి, ఆమెతో తెగతెంపులు చేసుకున్న ప్రభుదేవా... ఎట్టకేలకు నయనతారతో పెళ్లికి మార్గం సుగమనం చేసుకున్నాడు. అయితే... పెళ్లి ఎక్కడ చేసుకోవాలనేదానిపై ఇరువురి నడుమ తీవ్రస్థాయిలో కొట్లాట జరుగుతోందట. హైద్రాబాద్‌ లో చేసుకుందామని ప్రభుదేవా అంటుంటే... ఎట్టి పరిస్థితుల్లో చెన్నయ్ లోనే చేసుకోవాలని నయనతార మంకుపట్టు పడుతొందట.

ప్రభుదేవాను వలలో చేసుకుని, రామ్‌ లత్ కాపురంలో నిప్పులు పోస్తున్నదంటూ చెన్నయిలోని మహిళా సంఘాలు పలుమార్లు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేసి ఉండడం, 'నయనతార తనకు తారస పడితే చెప్పుతో కొడతాను' అంటూ రామ్‌ లత్ మీడియా ముఖంగా ప్రకటించడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుదేవాతో తన పెళ్ళి చెన్నయ్ లోనే జరగాలని నయనతార ఫిక్సయిపోయిందంట.

అయితే , టీనేజ్‌కొచ్చిన తన కొడుకులతో పాటు, తన మొదటి భార్య, తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉండే చెన్నయ్ లో తన పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా ఇబ్బంది పడుతున్నాట్ట. రామ్‌ లత్ నుంచి ప్రభుదేవాకు విడాకులు మే లేదా జూన్‌ లో మంజూరు కానున్నాయి. జూలైలో వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఎక్కడ చేసుకోవాలనేదాని పై మాత్రం తీవ్ర స్థాయిలో పేచీ పడుతున్నారు!

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu