»   » భార్యకి బేరం పెట్టిన ప్రభుదేవా..ఫలితం

భార్యకి బేరం పెట్టిన ప్రభుదేవా..ఫలితం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవా, నయనతారల వ్యవహారంతో విసిగివేసారిన రమలత్ న్యాయం కోసం చివరికి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభుదేవా పెళ్లి వ్యవహారం చిక్కుల్లో పడింది. దీంతో ప్రభుదేవా కొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. ఆమె తనను విడిచిపెడితే సెటిల్ చేస్తానంటూ బేరం పెట్టారు. ఈ వ్యవహారం సెటిల్ చేయమంటూ భార్య రమలత్ రాజీకొచ్చేలా చేయడానికి ఒక ప్రముఖ సినీ నిర్మాతను తన భార్య వద్దకు పంపారని సమాచారం. నయనతార నుంచి తన భర్తను విడిపించి అప్పగించాలని ఆమె చెన్నైలోని కుటుంబ సంక్షే మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ప్రభుదేవా, నయనతారల పెళ్లిని అడ్డుకోవాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇబ్బందులు పడ్డ ప్రభుదేవా తన భార్యతో సామరస్య పూర్వక చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు ఒక నిర్మాతను రాయబారానికి పంపించారు. అయితే రాయబారం వ్యవహారం బెడిసికొట్టింది. కావలసిన వసతులన్నీ సమకూర్చుతామన్న రాయబారాన్ని రమలత్ తోసిపుచ్చారు. దాంతో ప్రభుదేవా...తన తండ్రి సుందరంతోనూ, న్యాయవాదులతోను ముమ్మరంగా సమాలోచనలు ప్రారంభించారు. కాగా రమలత్‌కు మరో సినీ నిర్మాత జయంతి ఎ.ఎల్.ఎస్. కన్నప్పన్ అండగా నిలిచారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu