»   » ఆ టెన్షన్ నేను తట్టుకోలేను..ప్రభుదేవా

ఆ టెన్షన్ నేను తట్టుకోలేను..ప్రభుదేవా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చటం తగ్గించేశాడు. ఇదే విషయం అడిగితే, ఇక ఆర్టిస్ట్‌గా మారే ఆలోచన లేదంటున్నాడు. 'ఇప్పటికే దర్శకుడిగా యమ టెన్షన్‌ పడుతున్నా. మళ్లీ హీరోగా మొదలెట్టాననుకోండి...ఆ టెన్షన్‌ రెట్టింపు అవుతుంది. అది నావల్ల కాదు. భరించలేను. అందుకని హీరోగా ఇక కెమరా ముందుకు రావటం కష్టమే అని తేల్చి చెప్పేసాడు ప్రభుదేవా. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా ఎదిగిన ప్రభుదేవా..ప్రేమికుడు చిత్రంతో హీరోగా అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేసారు. అయితే ఇప్పుడు తమిళంలో వరసగా సినిమాలు చేస్తున్న ఆయన హిందీలోనూ స్టార్ డైరక్టర్ గా ముద్రపడి అక్కడా ఓ సినిమా చేస్తున్నారు.ఈ నేపధ్యంలో నటనంటే నా వల్లకాదని చేతులెత్తేస్తున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో 'వేడి' అనే చిత్రం చేస్తున్నాడు. షూటింగ్‌ నిమిత్తమై కోల్‌కతాలో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం అనంతరం హిందిలో విక్రమార్కుడు రీమేక్ చిత్రం ఉంటుంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించే ఈ చిత్రానికి రౌడీ రాధోడ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు.

English summary
Vikramarkudu will be remade in Hindi. Choreographer-turned-director Prabhu Deva is wielding the megaphone for the Hindi version of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu