»   » ప్రభుదేవా, నయనతార వివాహం ఎప్పుడంటే...

ప్రభుదేవా, నయనతార వివాహం ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన భార్యకి దాదాపు 30 కోట్ల రూపాయలు ఇచ్చి పదిహేనేళ్ల అనుబంధాన్ని వదిలించుకున్న ప్రభుదేవా తన ప్రేయసి నయనతారతో పెళ్ళికి రెడి అవుతున్నాడు. ఈ వివాహం జూలై నెలాఖరులో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. వివాహం అయిన వెంటనే హానీమూన్ కి ప్లాన్ చేసుకుంటున్న ఈ జంట అప్పటకి తమ షూటింగ్ లు పూర్తి చేసుకోవాలని తమ నిర్మాతలకు సూచిస్తున్నారు. జూన్ 2011లో చెన్నై ఫ్యామిలీ కోర్టు ద్వారా ఫార్మల్ డైవర్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇక పెళ్ళి రోజు కట్టుకోవటం కోసం నయనతార ఇప్పటికే కాంచీపట్నం లోని లీడింగ్ సిల్క్ హౌస్ లో సిల్క్ శారీ కోసం ఆర్డర్ ఇచ్చింది. చెన్నై లోని ఓ పాపులర్ ఫైవ్ స్టార్ హోటల్ ని వివాహం కోసం సంప్రదించారు. ప్రభుదేవా, నయనతార సన్నిహితులను మాత్రమే ఈ వివాహానికి పిలవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu