»   » అదంతా దేవుడి నిర్ణయం : ప్రభుదేవా

అదంతా దేవుడి నిర్ణయం : ప్రభుదేవా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రభుదేవా అంటే తెలియని హీరో ఉండరు. అంతలా ఆయన డాన్స్ లతో ముద్రవేసేసారు. ఆయన తమ పాటకు కొరియోగ్రఫి చేస్తే సూపర్ హిట్ అని నమ్మే సమయంలో ఆయన దర్శకుడుగా టర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకుంటున్న కళాకారుడు ప్రభుదేవా. పెళ్లి- విడాకులు, ప్రేమ- వైఫల్యం తర్వాత మరో కొత్తలోకానికి వచ్చానని చెబుతున్నాడు. పిల్లలు, వారి భవిష్యత్తే లోకమని చెబుతున్నాడు. అంతా దైవ నిర్ణయమని, ఏది జరిగినా తన మంచికే అంటున్నాడు.

గతంలో జరిగిన సంఘటనల ద్వారా నేర్చుకున్నదేమిటి అన్న విషయానికి సమాధాన మిస్తూ... జరిగిన దాని గురించి ఏమాత్రం చింతించడం లేదు. వాటినే గుర్తు చేసుకుని భవిష్యత్తును భారంగా గడపట్లేదు. అదంతా దేవుడి నిర్ణయం అని చెప్పారు. నేను ఏదీ కోల్పోలేదు. నా ప్రపంచం నా పిల్లలే. అంతకు మించి పెద్దదేమీ లేదు అని తేల్చి చెప్తున్నారు.

తన పిల్లలు గురించి చెప్తూ...నా పిల్లలు...రిషి ఐదో తరగతి. ఆదిత్‌ ఒకటో తగతి. పెద్దవాడికన్నా చిన్నోడు చాలా అల్లరి. చాక్లెట్లంటే చాలా ఇష్టం. పెద్దబ్బాయికి అదంతా అవసరం లేదు. ఎప్పుడూ ఆటలే. క్రీడలంటే మహా ఆసక్తి. పిల్లలతో వేసవిలో ఆస్ట్రేలియా వెళ్లాను. 15 రోజులు అక్కడే ఉన్నాం. వారి అల్లరి చూస్తే ఏదో తెలియని సంతోషం. ఒక్కటిగా ఉంటే కలిసే భోంచేస్తాం. వారికి నచ్చిన ఛానెల్‌ చూస్తా అన్నారు.

పిల్లలు చెన్నైలోనే ఉన్నారు. ఒంటరిగా ఉన్నామనే ఆలోచన రాకూడదనే వారికి ఎప్పటికప్పుడు ఫోన్‌ చేస్తుంటా. సమయం దొరికనప్పుడల్లా ఇంటికొచ్చేస్తా. అందరి ఇళ్లలో పిల్లలు తండ్రిని ఎలా ప్రేమిస్తున్నారో నన్నూ అలాగే ఇష్టపడుతున్నారు. వారితో ఇప్పుడు ఎక్కువ సమయం గడుపుతున్నా. టూర్లు, షికార్లకు వెళ్లొస్తున్నా. సమయం దొరికితే ఇంట్లో క్రికెట్‌ ఆడతాం. వాళ్లలో సంతోషం చూడాలన్నదే నా ప్రయత్నం అన్నారు.

తమిళ, తెలుగు పరిశ్రమలలో దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్న ఆయన బాలీవుడ్‌లోనూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నాడు. 'వాంటెడ్‌', 'రౌడీరాథోడ్‌'తో గుర్తింపు దక్కించుకున్న ప్రభుదేవా దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలంతా సిద్ధంగా ఉన్నారు. హిందీలో తీరికలేకుండా ఉన్నా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు కూడా కసరత్తు చేస్తున్నాడు.

English summary

 Prabhudeva says that he is very much in love with his kids and adds his life is his kids only.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu