గులేబకావళిలో ఇరుగదీసిన ప్రభుదేవా.. మళ్లీ ప్రేమికుడు.. జెంటిల్మెన్ రిపీటా?
Recommended Video

దర్శకుడిగా సత్తా చాటుతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మళ్లీ తెరమీద దుమ్ముదులిపేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగులో అభినేత్రి చిత్రానికి దర్శకత్వం వహించిన ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో గులేబకావళి చిత్రంలో ప్రభుదేవా నటించారు. ఈ చిత్రంలో కథానాయిక హన్సిక. ఈ చిత్రానికి సంబంధించిన టైలర్ విడుదలై ఆకట్టుకొంటున్నది.

ప్రభుదేవా ట్రెజర్ హంట్
నిధి వేట ఆధారంగా తెరకెక్కిన గులేబకావళి చిత్రంలో ప్రభుదేవా డ్యాన్సులు మళ్లీ జెంటిల్మన్, ప్రేమికుడు చిత్రాలను గుర్తుచేస్తున్నాయి. కొన్ని స్టెప్పుల్లో మళ్లీ పాత ప్రభుదేవా కనిపించాడనేది సినీ వర్గాల్లో టాక్ మొదలైంది.

గులేబకావళి రివేంజ్ డ్రామా
అంతేకాకుండా ఫైట్స్ కూడా బ్రహ్మండంగా కంపోజ్ చేసినట్టు ట్రైలర్‌లో స్పష్టమైంది. గులేబకావళి చిత్రంలో విగ్రహాల అక్రమ రవాణా, పగ, ప్రతీకారం, నిధి వేటను థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

ప్రభుదేవా పూర్తిస్థాయిలో
దాదాపు చాలా రోజుల తర్వాత ప్రభుదేవా మళ్లీ పూర్తిస్థాయిలో విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. దాంతో గులేబకావళి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రేవతి కీలక పాత్రలో
గులేబకావళి చిత్రం కేజేఆర్ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతున్నది. ఈ చిత్రంలో రేవతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











