»   » మా పాప దొరికింది.. అంతా దేవుడి దయ.. ఉద్వేగంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్

మా పాప దొరికింది.. అంతా దేవుడి దయ.. ఉద్వేగంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదృష్యమైన దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి స‌తీమ‌ణి, న‌టి డిస్కోశాంతి మేన‌కోడ‌లు కథ సుఖాంతమైంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు కోడలు అయిన అబ్రినా కనిపించకుండా పోవడం టాలీవుడ్ , కోలీవుడ్‌ల‌లో సంచ‌ల‌నంగా మారింది. దాదాపు 10 రోజుల తర్వాత అబ్రినా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, కార్తీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అద‌ృశ్యమైన డిస్కోశాంతి కోడలు

అద‌ృశ్యమైన డిస్కోశాంతి కోడలు

డిస్కోశాంతికి సోదరి లలితాకుమారి, సోదరుడు అరుణ్‌ ఉన్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌ మాజీ భార్య లలితా కుమారి కాగా వీరి సోదరుడు అరుణ్‌ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. అరుణ్, షెరిల్ దంపతుల పెద్ద కుమార్తె అబ్రినా. ప్లస్‌ టూ చదువుతున్న అబ్రినా సెప్టెంబర్ 6వ తేదీన పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బెంగళూరులోని ఓ చర్చికి సంబంధించిన హాస్టల్‌లో ఉంటున్నది.

ఆచూకీ కోసం గాలింపు

ఆచూకీ కోసం గాలింపు

అబ్రినా కనిపించకుండా పోవడంతో కంగారు ప‌డిన ఆమె త‌ల్లిదండ్రులు టీ నగర్, పాండీబజార్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మీడియా, సినీరంగంలోని పలువురి సహాయాన్ని ఆర్థించారు. అబ్రినా ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. ఇటీవల లలిత కుమారి, అబ్రినా తల్లి షెరిల్ మీడియా సమావేశం నిర్వహించారు. అబ్రినా ఆచూకీ దొరికితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

56 సీసీటీవీ ఫుటేజీలను

56 సీసీటీవీ ఫుటేజీలను

స్కూల్‌లోని 56 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా ఎలాంటి సమాచాం లభ్యం కాకపోవడంతో అబ్రినా కనిపించకుండా పోవడంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. అబ్రినా గురించి తలచుకొంటూ ఆమె తల్లి షెరిల్ కన్నీరు మున్నీరయ్యారు.

పాప దొరికింది.. కార్తీ ట్వీట్

ఈ క్ర‌మంలో న‌టుడు కార్తీ త‌న ట్విట్ట‌ర్‌లో అబ్రినా ఆచూకీ దొరికింది. ఈ విష‌యంలో బెంగళూరులో సహాయం చేసిన వాలంటిర్స్, తమిళనాడు పోలీసుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు. అబ్రినా క్షేమంగా తిరిగి రావడంతో కార్తీ ఆనందంలో మునిగిపోయారు.

బిడ్డ క్షేమంగా తిరిగి వచ్చింది..

అలాగే అబ్రినా తిరిగి రావడంపై ప్ర‌కాశ్ రాజ్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. మా పాప అబ్రినా ఇంటికి చేరుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ప్రార్థనలు భగవంతుడు ఆలకించాడు. క్షేమంగా మా బిడ్డ ఇంటికి తిరిగి వచ్చింది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

ఆరా తీస్తున్న పోలీసులు

ఆరా తీస్తున్న పోలీసులు

స్కూల్ నుంచి అదృష్యమైన అబ్రినా ఇన్ని రోజులు ఎక్క‌డికి వెళ్లింది? ఏం చేసింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా స్నేహితులతో చెప్పపెట్టకుండా టూర్‌కు వెళ్లిందా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

English summary
Disco Shanthi and Lalitha Kumari’s niece and daughter of Arunmozhi Varman, Abrina, who went missing recently, has been found. Actor Prakash Raj, Karthi posted a message with the photograph of the girl on his Twitter account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu