»   » ఎంతముద్దుస్తున్నాడో : స్నేహ కొడుకు తొలి పుట్టిన రోజు సెలబ్రేషన్ (ఫొటోలు)

ఎంతముద్దుస్తున్నాడో : స్నేహ కొడుకు తొలి పుట్టిన రోజు సెలబ్రేషన్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : వెంకీ, రాధా గోపాళం, శ్రీరామదాసు, రాజన్న, ఉలవ చారు చిత్రాల ఫేం స్నేహ తన సహ నటుడు ప్రసన్నను పెళ్లాడిన సంగతి తెలిసిందే. స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే 11న జరిగింది. అలాగే ఆ తర్వాత ఈ ముచ్చటైన జంటకు ఓ బాబు జన్నించాడు. ఆ బాబుకి విహాన్ అనే పేరు పెట్టారు. ఆగస్టు 11 నఆ బాబు తొలి పుట్టిన రోజుని తల్లి తండ్రులు ఘనంగా జరిపారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు స్నేహ-ప్రసన్న దంపతులు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ...పెళ్లయిన తర్వాత స్నేహ సినిమాల్లో కొనసాగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. ప్రస్తుతం స్నేహ-ప్రసన్న దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

స్లైడ్ షోలో... పుట్టినరోజు ఫొటోలు

ప్రేమ

ప్రేమ

మూడేళ్ళు ప్రేమించుకుని స్నేహ, ప్రసన్న ఒకటి అయ్యారు.

కొడుకు తింటూంటే

కొడుకు తింటూంటే

తమ కుమారుడు బర్తడే కేకు ని తింటూంటే తల్లి కళ్లలో ఎంత ఆనందమో చూడండి

దృష్టంతా

దృష్టంతా

విహాన్ దృష్టి మొత్తం కేకుపైనే ఉంది, స్నేహ మాత్రం ఫొటోకు ఫోజు పెడుతోంది

పజిల్

పజిల్

తల్లితండ్రులిద్దరూ గర్వంగా చూస్తూంటే, కొడుకు మాత్రం పజిల్ గా వీళ్లవంక చూస్తున్నాడు

ముద్దులు

ముద్దులు

తల్లి,తండ్రులు ముద్దులు పెడుతూంటే విహాన్ మాత్రం తన దృష్టిని మాత్రం కేకుపైనే పెట్టాడు

స్పెషల్ డ్రస్

స్పెషల్ డ్రస్

కొడుకు మొదటి పుట్టిన రోజుని ఎంత స్పెషల్ గా భావిస్తున్నారో వారి డ్రస్ వంక చూస్తే మీకు అర్దమవుతుంది

విషెష్

విషెష్

స్నేహ, ప్రసన్న ఫ్యాన్స్ మొత్తం విహాన్ కు పుట్టిన రోజు విషెష్ చెప్పారు.

త్వరగా

త్వరగా

ఆ కేకు మీదకు ఎంత త్వరగా దూకేద్దామా అన్నట్లు బాబు చూస్తున్నాడు కదా

మీక్కూడా

మీక్కూడా

కేకుని చూస్తూంటే మీక్కూడా దాన్ని తినేయాలనిపిస్తోంది కదూ..

మీక్కూడా

మీక్కూడా

మీకు కూడా విహాన్ కు పుట్టిన రోజు విషెష్ చెప్పాలని ఉంటే..క్రింద కామెంట్ బాక్స్ లో చెప్పేయండి..తీరక ఉన్నప్పుడు విహాన్ చూస్తాడు

English summary
Sneha and Prasanna celebrated their son Vihaan's first year birthday today (August 11) at their residence in Chennai. Vihaan, who was born at 1:55 AM last year, looked ecstatic as he was enjoying his first birthday cake coupled with his parents' warm embrace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu