»   » స్నేహతో ఆ హీరో పెళ్ళి నిజమేనా?

స్నేహతో ఆ హీరో పెళ్ళి నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి స్నేహ, హీరో ప్రసన్నల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే వీరి సాన్నిహిత్యం స్నేహ కుటుంబ సభ్యులకు కూడా సమ్మతమేనని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రసన్న మాట్లాడుతూ.. తనకు పెళ్లి కుదిరితే దాచాల్సిన అవసరంలేదని బహిరంగంగానే వెల్లడిస్తానని అన్నారు. అలాగే స్నేహతో కలసి గోవా సినిమాకు వెళ్లినది వాస్తవమేనన్నారు. ఇక ఇటీవల స్నేహ అక్క పుట్టిన రోజు వేడుకలకు ఆత్మీయులను ఈ జంట కలసి ఆహ్వానించారని ఒప్పుకున్నారు.

వీరిద్దరు కలిసి అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించారు. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమకు బీజం పడిందని ఆ తరువాత ఏ కార్యక్రమానికైనా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని జంటగాగా హాజరువుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్ని స్నేహ, ప్రసన్న ఇద్దరూ ఖండిస్తూ ప్రకటన ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే స్నేహ కూడా తనకు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్నేహితులు చాలా మంది ఉన్నారని, వాళ్లలో ప్రసన్న ఒకరని పేర్కొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu