»   » సిద్ధమవుతున్న 'జీన్స్‌' చిత్రం సీక్వెల్‌

సిద్ధమవుతున్న 'జీన్స్‌' చిత్రం సీక్వెల్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : ఇప్పుడు సీక్వెల్స్ యుగం నడుస్తోంది. నాన్‌ అవన్‌ ఇల్లె, బిల్లా, విశ్వరూపం, సింగం, జైహింద్‌.. తరహాలో 'జీన్స్‌' కూడా సీక్వెల్‌కు సిద్ధమైంది. ప్రశాంత్‌ కెరీర్‌ను అమాంతం ఆకాశానికెత్తిన చిత్రం 'జీన్స్‌'. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి.

దాదాపు పదిహేనేళ్ల తర్వాత సీక్వెల్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రశాంత్‌ తండ్రి త్యాగరాజన్‌ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల మాట. ఇటీవలే 'జీన్స్‌ 2' టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో నమోదు చేశారట త్యాగరాజన్‌. తన కుమారుడితో తాజాగా 'మలయూర్‌ మంబట్టియన్‌' తెరకెక్కించారాయన. ఇప్పుడీ కొత్త సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర నటీనటుల గురించి వివరాలు తెలియరాలేదు.

ఇక ఈ చిత్రం డైరక్టర్ శంకర్ సినిమాలంటే సౌత్ లో విపరీతమైన క్రేజ్. ప్రస్తుతం ఆయన విక్రమ్‌తో 'మనోహరుడు' చిత్రం రూపొందిస్తున్నారు . ఇది తుది దశకు చేరుకొంది. మరి శంకర్‌ తెరకెక్కించబోయే తదుపరి చిత్రం ఏమిటనే విషయమ్మీద చెన్నై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

అయితే శంకర్ ఇప్పటికే కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకొన్నారని తెలిసింది. శంకర్‌ దర్శకత్వంలో యువ హీరో, రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు కొద్ది వారాల్లో వెల్లడవుతాయి.

విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తన రేంజికి తగిన విధంగా భారీ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రం తొలి షెడ్యూల్ చెన్నయ్ ప్రాంతంలో చిత్రీకరించారు. సినిమా గ్రాండ్‌గా రావడానికి బెస్ట్ లొకేషన్లు ఎంపిక చేసుకున్నాడు. గతంలో శంకర్ నిర్మించిన 'జీన్స్' చిత్రంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు పలు ప్రపంచ ప్రసిద్ధ లొకేషన్లు చూపించారు. తాజాగా ఐ చిత్రం కూడా వరల్డ్ బెస్ట్ ప్లేసెస్‌లో చిత్రీకరణ జరుపి ప్రేక్షకులకు కనువిందు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Shankar’s Jean which gave Prashanth a real boost in his career is set to be made as a sequel. Now the actor is desperately on verge of the need of a hit, thus his father and yester year lead actor Thiagarajan is all set to take his sons career back to track. Thiagarajan has signed Jean2 title, and has hinted a sequel of 1998 hit film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X