»   » స్టార్ కమిడయన్ ..పెద్ద మూర్ఖుడు

స్టార్ కమిడయన్ ..పెద్ద మూర్ఖుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : దర్శకుడు ఉన్నతమైన శాస్త్రవేత్తలా మారితే 'టైటానిక్‌', 'అవతార్‌' వంటి చిత్రాలు పుట్టుకొస్తాయి. కానీ.. ఓ శాస్త్రవేత్త మూర్ఖంగా ప్రయోగాలు చేస్తే.. థియేటర్‌లో హాస్య పువ్వులే పూస్తాయని చెబుతున్నారు దర్శకుడు ఆర్‌.ఎస్‌.రాజా. 'ఎన్న కొడుమసార్‌..' అంటూ ఒక్క డైలాగుతో తన కెరీర్‌ను నెడుతున్న ప్రేమ్‌జీ ప్రస్తుతం హీరోగా మారారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తన అన్న వెంకట్‌ప్రభు చిత్రాల్లో కీలకమైన హాస్యపాత్రలో పోషించే ప్రేమ్‌జీ హీరోగా నటిస్తున్న తొలిచిత్రం'మాంగా'. హీరోగా మాత్రమే కాకుండా సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. మరి ఇళయరాజాకు తమ్ముడు కుమారుడైతే ఆ మాత్రం ప్రయోగాలు చేయకూడదా..? అంటున్నారు ప్రేమ్‌జీ.

Premgi’s Maanga has him essaying a scientist

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇందులో ఓ గొప్ప శాస్త్రవేత్తగా ప్రేమ్‌జీ నటిస్తున్నారు. ఇది అతని దృష్టిలో విషయం. కానీ అతనో చెత్త శాస్త్రవేత్త. ఓ గొప్ప ఆవిష్కరణతో ఓజోన్‌ పొరలోని చిల్లును మూసివేయాలని ప్రయత్నిస్తారు. ఇందుకోసం తానే స్వయాన ఓ రాకెట్‌ను రూపొందిస్తారు. ఆ తర్వాత ఏమైందన్నదే కథ.

Premgi’s Maanga has him essaying a scientist

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. తన ప్రయోగంతో 1950 కాలానికి కూడా చేరుతారు. అప్పటి భాగవతార్‌తో ప్రేమ్‌జీ మాట్లాడే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయని చెప్పారు.

English summary
Actor-music director Premgi Amaren is essaying the lead role in an upcoming film titled Maanga which is directed by R.S. Raja and produced by Sakthivel. The film’s script has been spilled none other than by the film’s director himself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu