»   » ఆ విలన్ ఇప్పుడు హీరో, ఆ హీరో ఇప్పుడు విలన్ : సూపర్ ట్విస్ట్

ఆ విలన్ ఇప్పుడు హీరో, ఆ హీరో ఇప్పుడు విలన్ : సూపర్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విక్రమ్... దక్షిణాది లో ఎన్ని ఫ్లాపులొచ్చినా తాను మాత్రం హిట్ హీరో అనిపించుకుంటూనే ఉంటాడు. నిజానికి గత పదేళ్ళలో అపరిచితుడు తప్ప ఒక పక్కా హిట్ అంటూ లేదు విక్రమ్ కి. అయినా తాను మాత్రం ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోనే ఉంటాడు. భారీ బడ్జెట్ ని విక్రమ్ మీద పెట్టటానికి మరింత మంది నిర్మాతలు ముందుకు వస్తూనే ఉన్నారు.

ధృవనక్షత్రం

ధృవనక్షత్రం

ఎంత రిస్క్ అనుకున్నా ప్రయోగాలకు మాత్రం బ్రేక్ వేయడు, తన వంతు గా ఎంత చేయాలో అంతకు మించి ఇవ్వటానికే చూస్తాడు అందుకే అతనికా క్రేజ్. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం అనే మూవీలో నటిస్తున్నాడు విక్రమ్.

విక్రమే హీరో

విక్రమే హీరో

గతం లో చియాన్ ఇచ్చిన ఫ్లాపుల్లోనే ఉత్తమ ఫ్లాప్ అనదగ్గ చిత్రం మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన "విలన్" హిందీ తమిళ్ తెలుగు మూడు భాషల్లోనూ ఈ సినిమా వచ్చినా తమిళ్, తెలుగుల్లో విక్రమే కనిపించాడు. కానీ మూడు భాషల్లోనూ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గానే నిలిచింది.

పూర్తిగా మట్టి కరిచింది

పూర్తిగా మట్టి కరిచింది

అయితే ఇప్పుడు ఈ సినిమా వార్తల్లోకెందుకొచ్చిందంటే. విలన్ తమిళ, తెలుగు వెర్షన్ లలో పూర్తిగా మట్టి కరిచింది. ఈ సినిమాలో విక్రమ్ ది నెగెటివ్ రోల్ అయితే "నామ్ కే వాస్తే" అయినా పృద్వీరాజ్ ది హీరో పాత్ర. అయితే ఇప్పుడు ఈ రోల్స్ రివర్స్ కానున్నాయట. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవనక్షత్రం అనే మూవీలో నటిస్తున్నాడు విక్రమ్.

మలయాళ హీరో పృథ్వీరాజ్

మలయాళ హీరో పృథ్వీరాజ్

ఈ మూవీలో మలయాళ హీరో పృథ్వీరాజ్ ను విలన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అసలీ విషయాన్ని మేకర్స్ ప్రకటించలేదు కానీ.. ఇప్పటికే కొన్ని టీజర్స్ రిలీజ్ అయ్యాయి. విడుదలైన రెండు టీజర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. వీటిలో విలన్ ను మాత్రం చూపించలేదు.

వాయిస్ మాత్రం వినిపించేలా

వాయిస్ మాత్రం వినిపించేలా

అయితే.. విలన్ వాయిస్ మాత్రం వినిపించేలా ఈ టీజర్ ను కట్ చేశారు. ఆ వాయిస్ ద్వారా విలన్ ఎవరో గుర్తుపట్టేశారు ఆడియన్స్. ఆ వాయిస్ ఎవరిదో కాదు పృద్వీరాజ్ దే. మలయాళంలో పెద్ద హీరో అయిన పృథ్వీరాజ్.. ఆల్రెడీ బాలీవుడ్లో విలన్ అవతారం ఎత్తాడు.

నామ్ షబానా'లో

నామ్ షబానా'లో

తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నామ్ షబానా'లో అతనే విలన్. ఇప్పుడు తమిళులకు హీరోగానే పరిచయమున్న పృథ్వీ.. అక్కడి వాళ్లను కూడా విలన్‌గా పలకరించబోతున్నాడు. విక్రమ్-గౌతమ్ కాంబినేషనే ఆసక్తి రేకెత్తించేదంటే.. ఇందులో పృథ్వీరాజ్ విలన్ అనగానే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

తమిళ.. తెలుగు భాషల్లో

తమిళ.. తెలుగు భాషల్లో

గౌతమ్ చేసిన యాక్షన్ సినిమాలన్నింట్లో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పృథ్వీరాజ్ పాత్ర కూడా అలాగే ఉంటుందేమో చూడాలి. ఈ చిత్రం తమిళ.. తెలుగు భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సారి ఈ ఇద్దరు ప్రత్యర్థులు ప్రేక్షకులని ఎంత మేరకు అలరిస్తారో చూడాలి.

English summary
‘Dhruva Natchathiram’ directed by Gautham Menon and starring the intensity personified hero Vikram. It is again being reported that Malayalam superstar Prithviraj Sukumaran is the villain opposite Vikram in this most anticipated film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu