»   » హీరోయిన్ ప్రియా ఆనంద్‌కు గాయాలు

హీరోయిన్ ప్రియా ఆనంద్‌కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్ కు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. 'ఎదిర్‌నీచ్చల్‌'తో మరింత పేరు సంపాదించుకుంది. ఇటీవల విక్రంప్రభుతో జోడీగా నటిస్తున్న 'అరిమానంబి' చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలో ఇద్దరూ పరిగెత్తే సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రియా ఆనంద్‌ కాలుజారి పడటంతో మోకాలికి తీవ్రగాయాలై రక్తమొచ్చింది. దీన్ని లెక్కచేయకుండా.. మళ్లీ పరుగు అందుకుంది.

వెంటనే షూటింగ్ ను తాత్కాలికంగా ఆపి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆమె విశ్రాంతి తీసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో కాసేపటికి యథావిధిగా చిత్రీకరణ కొనసాగింది. ప్రస్తుతం మిర్చిశివ హీరోగా 'వణక్కం చెన్నై'లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత అధర్వ, విక్రం ప్రభు, గౌతంకార్తీక్‌ల చిత్రాల్లో సందడి చేయనుంది. 'ఎదిర్‌నీచ్చల్‌' తర్వాత మార్కెట్‌ పెరగడంతో కోలీవుడ్‌కు అత్యంత ముఖ్య హీరోయిన్‌గా మారింది.

ఇక ప్రియా ఆనంద్ త్వరలో హిందీకు వెళుతోంది. గతంలో హీరో నెం.1 మరియు కూలీ నెం.1 చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ వసు భగ్నాని ప్రొడక్షన్ సంస్థలో మూడు చిత్రాలలో నటించడానికి ప్రియా ఆనంద్ అంగీకారం తెలిపారు. వసు భగ్నాని కుమారుడు జాకీ భగ్నాని హీరోగా పరిచయం కానున్న "రంగ్ రేజ్" చిత్రం ద్వారా ప్రియా ఆనంద్ బాలీవుడ్లో అడుగు పెట్టనున్నారు. యంగ్ హీరో రానా నటించిన 'లీడర్' చిత్రం ద్వారా ప్రియా ఆనంద్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు, ఆ తర్వాత '180′ మరియు 'రామరామ కృష్ణ కృష్ణ' చిత్రాలలో నటించారు. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.


ఇక బాలీవుడ్‌లో తన ఎంట్రీ గురించి చెప్తూ... పరిశ్రమలోకి ఎవరి సిఫారసు లేకుండా అడుగుపెట్టాను. నేను నటించిన పాత్ర కోసం బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, లాస్‌ ఏంజెల్స్‌ తదితర ప్రాంతాల్లో ఆడిషన్స్‌ జరిపారు. చివరిగా నన్ను ఎంపిక చేశారు. ఒకప్పుడు బాలీవుడ్‌ నుంచి తమిళనాడుకు హీరోయిన్స్ వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ శాసిస్తున్నారు. ఇక చిన్న వయసు నుంచే శ్రీదేవికి పెద్ద అభిమానిని. ఆమెకు చాలా లేఖలు, పెయింటింగ్స్‌ పంపాను. అలాంటి అభిమాన తారతో కనిపించడం నిజంగానే అదృష్టం. సినిమాలో నటించేందుకు చాలా సహకరించారు. వ్యక్తిగతంగానూ సలహాలు ఇచ్చారు అంది.


రజనీకాంత్‌ తో నటించటమే తన ఆశయమని చెపుతూ... వద్దని చెప్పినా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరే చెబుతా. ఆయనతో ఒక్క దృశ్యంలో కనిపించినా సంతోషమే. 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'ను రజనీకాంత్‌ పక్కన కూర్చుని చూశాను. చాలా ఎంజాయ్‌ చేశా. వెళ్తూ.. వెళ్తూ నన్ను అభినందించారు. నా జీవితంలో చాలా సంతోషకరమైనరోజదే అన్నారు. అలాగే తన జీవితంలో సినిమాలో నన్ను ఎలా చూస్తున్నారో.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటా. అల్లరి ఏమాత్రం తగ్గదు. నవ్వుతూ.. ఇతరులనునవ్వించాలనుకుంటా అన్నారు.

English summary
Kiruthiga Udhayanidh who won the best director award at the Jaipur International Film festival for her short film Life, is ready with her debut Tamil film Vanakkam Chennai. Her husband, Udhayanidhi Stalin, a well known producer in Tamil, is producing this film under his banner, Red Giant Movies. The film is a comedy scripted by Kiruthiga. Mirchi Siva and Priya Anand play the lead roles. Current comedy king Santhanam is also there to tickle the funny bone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu