For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ, కమల్‌ను కడిగి పారేసిన యువ హీరోయిన్! డైలాగ్స్‌తో మోసపోవద్దని..

  By Rajababu
  |

  తమిళ రాజకీయాల్లోకి సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రవేశించడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు సానుకూలంగా, మరికొందరు ప్రతికూలంగా తన ఓపినియన్స్‌ను వెల్లడించారు. కానీ రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీపై యువత తార ప్రియా భవానీ శంకర్ తీవ్రంగా విమర్శలు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్నది. తాజా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

  డైలాగ్స్‌తో పడిపోవద్దు

  డైలాగ్స్‌తో పడిపోవద్దు

  సినీ నటుల నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఆశించడం తప్పుకాదు. తెరపైన వాళ్లు చెప్పే డైలాగ్స్ చూసి మనం మన జీవితాలకు అన్వయించుకొంటాం. అలా వారిని ఆరాధించడం సరికాదు. ప్రేక్షకులైనా, సాధారణ ప్రజలైనా రాజకీయాల గురించి, నేతల గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణం అని ప్రియా భవానీ అన్నారు.

  రాజకీయాలంటే అసహ్యం

  రాజకీయాలంటే అసహ్యం

  సోషల్ మీడియాలో చూస్తే కొందరు చేసే కామెంట్లు చాలా షాకింగ్‌గా ఉంటాయి. వారి మాటలు చూస్తే రాజకీయాలపై అసహ్యం పుడుతుంది. ఇలానే పాలిటిక్స్ ఉంటాయా అనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ నేతలను నమ్మకం పెట్టుకోవడం పెద్ద తప్పు. అలాగే ఇటీవల తమిళ రాజకీయాల్లోకి వచ్చిన స్టార్ హీరోలపై కూడా భరోసా పెట్టుకోవద్దు అని రజనీ, కమల్‌ను పరోక్షంగా విమర్శించింది.

   నేతలుగా ఆలోచనలు వేరు

  నేతలుగా ఆలోచనలు వేరు

  నాకు కమల్ సార్.. రజనీ సార్ అంటే చాలా ఇష్టం. వారి సినిమాలు రిలీజైతే ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తాను. అలాంటి వాళ్లను గెలిపిస్తే ఐదేళ్లు మనల్ని పాలిస్తారు. ఇది రెండున్నర గంటల సినిమా కాదు.. ప్రజల తలరాతను మార్చే బాధ్యత. ఒకసారి రాజకీయ నేతలైన తర్వాత వారి ఆలోచనలు మారిపోతాయి. సినీ నటులుగా ఉన్నప్పుడు మనకు ఉండే అభిప్రాయాలు వారిపై పెట్టుకోవద్దు అని ప్రియా హెచ్చరించారు.

  Shruti Haasan Gets Serious Comments On Her From Fans
  కార్తీ సరసన ప్రియా భవానీ

  కార్తీ సరసన ప్రియా భవానీ

  ప్రియా భవానీ టీ నటిగా తమిళ ప్రేక్షకులకు సుపరిచితులు. టీవీ ఆర్టిస్టుగా విశేష ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నారు. ఆ తర్వాత మెయథ మాన్ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. కార్తీ నటించిన కడైకుట్టి సింగం చిత్రంలో కీలక పాత్రను పోషించింది. తాజాగా ఆమె బోల్డ్‌గా చేసిన వ్యాఖ్యలు తమిళ వినోద రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

  English summary
  Actress Priya Bhavani Shankar made pretty bold statements about political newbies Rajinikanth and Kamal Haasan. She said that Just because two big icons have entered politics, we can't blindly bank on them. It is not a 2-hour-30-minute film. If they win elections, they have to lead us for five years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X