»   » సూర్యతో చేయడానికి ప్రియా వారియర్ స్థాయి సరిపోదు, తేల్చి చెప్పిన టాప్ డైరెక్టర్

సూర్యతో చేయడానికి ప్రియా వారియర్ స్థాయి సరిపోదు, తేల్చి చెప్పిన టాప్ డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకే ఒక్క వీడియోతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన ప్రియా వారియర్ గురించి తరచూ ఏదో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. తన మెస్మరైజింగ్ అందం, ఆటిట్యూడ్‌తో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ఆమెను హీరోయిన్‌గా పెట్టుకునేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సూర్య హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే తమిళ చిత్రంలో ప్రియా వారియర్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుందనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో వెంటనే దర్శకుడు కెవి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. తాము ప్రియా వారియర్‌ను సంప్రదించలేదని, సూర్య సరసన పెద్ద హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నామని, ప్రియా వారియర్ స్థాయి సరిపోదని తెలిపారు.

 Priya Prakash Varrier is not part of Suriya’s next

ప్రస్తుతం తమ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని కెవి ఆనంద్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించనున్నారు.

కాగా....ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ప్రియా వారియర్‌ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆకట్టుకునే అందం, యువతను కట్టిపడేసే యాటిట్యూడ్ ఉండటంతో ఆమె తమ సినిమాల్లో ఉండటం ప్లస్సవుతుందని పలువురు ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు.

ప్రియా వారియర్ నటించిన 'ఓరు అడార్ లవ్' చిత్రం మార్చి నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో జూన్ 14వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా విడుదల తర్వాత ప్రియా వారియర్ దశ తిరగడం ఖాయం అంటున్నారు.

English summary
Rumour mills were abuzz with the news that the recent Malayalam sensation Priya Prakash Varrier has been cast opposite Suriya. Reports also suggested that Varrier was one of the female leads of the film. Now, the director KV Anand has himself has clarified that he hasn’t even approached Priya for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X