»   »  కాజల్ తో కష్టమే

కాజల్ తో కష్టమే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kajol
తేజ 'లక్ష్మి కళ్యాణం' తో పరిచయమైనా 'చందమామ' తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సొగసిరి కాజల్ అగర్వాల్. తాజాగా నితిన్‌తో కలిసి నటించిన 'ఆటాడిస్తా' పెద్దగా ఆడకపోయినా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్‌చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలా కెరీర్ పరంగా ఎదుగుతున్న ఆమెలో వ్యక్తిగతంగా రోజు రోజుకు మార్పు వస్తోందిట. మొదట్లో ఉన్న వినయం పోయిందిట. రెక్లస్ బాగా పెరిగిందిట. 'ఒక హిట్టు జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుందిట!' ఆమె బిహేవియర్.

అంతే గాక కాజల్‌ ఈ మధ్య చాలా ఇబ్బంది పెడుతోందని ప్రతీ విషయానికి బెట్టు చేస్తోందని నిర్మాతలు వాపోతున్నారు. అందులోనూ తమిళ నిర్మాతలు అయితే మరీ గోల పెడుతున్నారు. వాస్తవానికి కాజల్ హీరోయిన్‌గా తమిళంలో విడుదలైంది ఒక్కచిత్రమే. అయితే ఆ చిత్రం అక్కడ మంచి హిట్ సాధించింది. దాంతో కాజల్ తన దగ్గరికి వచ్చే నిర్మాతలను గొంతెమ్మ కోరికలు కోరుతోందట. ఆమె డిమాండ్లు,షరతలు రోజు రోజు కి మితి మీరుతున్నాయట. దీంతో కాజల్‌ను తమ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకునే నిర్మాతలు ఎందుకొచ్చిన గొడవరా అని కాజల్ వైపుకే వెళ్లడం లేదట. అలా హిట్టు ఉన్నా ప్రస్తుతం తమిళంలో కాజల్ నటించే చిత్రం ఒక్కటి కూడా లేదు. దాంతో కాజల్ నటించింది మూడు చిత్రాలే అయినా నిర్మాతలను మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగిస్తోందిని చెప్పుకుంటున్నారు. అయినా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి గాని ఇలా అయితే ఎలా అని శ్రేయాభిలాషులు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X