అజిత్ 'ప్రేమ లేఖ ' నిర్మాత అరెస్టు

నిర్మాత శివశక్తి పాండియన్‌కు తనకు ఆర్థికపరమైన లావాదేవీలు సాగుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఆయన తనపై గొడవపడి హత్య చేస్తానంటూ బెదిరించారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై థౌజండ్‌లైట్స్ ప్రాంత పోలీసులు కేసు నమోదు చేసి.. ఎగ్మూరు కోర్టులో విచారణ జరిపారు.
కానీ గత పలు దఫాలుగా ఈ కేసు విచారణకు వచ్చినా.. శివశక్తి పాండియన్ మాత్రం హాజరు కాలేదు. దీంతో కోర్టు అతనికి అరెస్టు వారెంట్ జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు థౌజండ్‌లైట్స్ పోలీసులు ఆయన్ను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.


Click it and Unblock the Notifications











